Fire Accident : భద్రాచలంలోని కిమ్స్ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. హాస్పిటల్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ఆసుపత్రి మొత్తం పొగ అలుముకోవడంతో రోగులు, వైద్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు రోగుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లింది . సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా సహాయచర్యలో పాల్గొన్నారు. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి మంటలు చెలరేగడంతో రోగులు, సహాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు
కూకట్‌పల్లి బాలానగర్ మెట్రో స్టేషన్ కింద జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ లో మంటలు చెలరేగి కారు ముందు భాగానికి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.