పాదయాత్రలో రైతుల కష్టాలను చూస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేశానికి లోనయ్యారు. మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడితే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను స్వయంగా దున్నేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ప్రజా సంగ్రామ యాత్ర సాగుతోంది. మంగళవారం యాత్రకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వీరిద్దరూ ప్రసంగించారు.Also Read : రాజకీయాల్లో రెండో వైపు చూపేందుకు బాలకృష్ణ రెడీ ! ఫ్యాన్స్‌తో కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కేసీయార్ ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వమని ప్రకాష్ జవదేకర్ విరుచుకుపడ్డారు. అయితే ఫామ్‌హౌస్‌కు లేకపోతే ప్రగతి భవన్‌కు పరిమితమై.. ఇంట్లో నుంచి బయటకు రాని ఏకైక సీఎం కేసీఆర్ అని జవదేకర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు చేశారని.. కానీ కేసీఆర్ సర్కార్ తీరుతో వారి బలిదానాలు చేసిన వారి ఆత్మ ఘోషిస్తోందన్నారు. ఉద్యమంలో ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం, నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ అని కేసీఆర్‌ను ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో లక్షా 40 వేల ఉద్యోగ ఖాళీలు ఉంటే ఒక్కటి కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని ఇంత వరకూ అమలు చేయలేదని విమర్శించారు. Also Read : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ రూ.కోటి పరువు నష్టం దావా... మధ్యంతర ఉత్తర్వులు జారీ..
సభలో మాట్లాడిన బండి సంజయ్ రైతుల సమస్యల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో తెలంగాణలో పండిన ప్రతి గింజను తామే కొనుగోలు చేస్తాం.. కేంద్ర పెత్తనమేంటని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు వరి వేస్తే ఉరితో సమానం అంటున్నారని మండిపడ్డారు. మొక్క జొన్నను కొనుగోలు చేయబోమని అంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గనుక మొక్కజొన్నను కొనుగోలు చేయకపోతే చేయకుంటే ఊరుకునేది లేదని.. ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్‌ను దున్నేస్తానని హెచ్చరించారు. చెరుకు రైతులను నిండా ముంచారని.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసేశారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యమంలో కామారెడ్డి ప్రజలే కీలకంగా ఉన్నారని..ఉద్యమంలో బోనమెత్తి బతుకమ్మ ఆడింది కేసీఆర్ కుటుంబం కోసమేనా అని వారిని ప్రశ్నించారు. బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనేలా ప్రచారం చేసుకున్నారని.. కామారెడ్డి ప్రజలకు బతుకమ్మ ఆడటం తెలీదనే ఆమె వచ్చిందా అని ప్రశ్నించారు. మూడేళ్ల కిందట కామారెడ్డిలో పర్యటించిన కేసీఆర్ అనేక వరాలు ప్రకటించారని అందులో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి