KTR Vs Bandi Sanjay :   కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అని..  రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపిస్తానని తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజ్య సవాల్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్  నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో  ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను తంబాకు తింటానని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. తనకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా... అందుకోసం రక్త నమూనాలతో సహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇస్తానని సవాల్ చేశారు.  మరి కేటీార్  రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదని..డాక్టర్ దగ్గరికి వెళ్లి కేటీఆర్ వి రెండు వెంట్రుకలు ఇస్తే చాలు.. డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుస్తుందన్నారు.  ఒక  బెంగళూరు డ్రగ్స్, హైదరాబాద్ డ్రగ్స్ కేసును పక్కా రీఓపెన్ చేయిస్తామని.. లంగదందాలు... దొంగ దందాలు చేస్తే .. చూస్తూ ఊరుకుంటామా? అని హెచ్చరిచారు  ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని బండి సంజయ్ ఆరోపించారు.  తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు.  


అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని.. అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదని బండి సంజయ్ ఆరోపించారు.   వారం రోజులపాటు బస్తీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 12 మంది ఎస్సీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత కూడా మోడీదేనన్నారు.  ఎంతోమంది ఎస్సి లను గవర్నర్లు, ముఖ్యమంత్రు లుగా చేసిన ఘనత బిజెపి దేనని.. ప్రతి సంవత్సరం 1,20,000 మంది దళిత యువకులను, పారిశ్రామికవేత్తలుగా మార్చుతున్న ఘనత బిజెపి దేనని బండి సంజయ్ ప్రకటించారు. 


జి20 దేశాల్లో భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం రావడం మనందరికీ గర్వకారణమని.. అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీ అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే... కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారని బండి సంజ్య ప్రశఅనించారు. జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముందని ప్రశఅనించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నారని ఆరోపించారు.  దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు... దండుకోడానికి మాత్రం పైసలు ఉన్నాయన్నారు. 


రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల దిబ్బగా మార్చేసి..  పుట్టబోయే ప్రతి బిడ్డపై లక్ష రూపాయలు అప్పు పెట్టిండని బండి సంజయ్ మండిపడ్డారు.  కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీ పోయి లక్ష కోట్ల లిక్కర్ దందా చేసింది..కేసీఆర్ కుటుంబం విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టిందన్నారు. కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే... తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ దందాలో కవిత 10 ఫోన్లను ధ్వంసం చేసిందని.. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో... ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుందన్నారు.  అవినీతిలో అయ్యకు తగ్గ బిడ్డగా కవిత గుర్తింపు పొందిందని విమర్శించారు.