Income Tax Rules: పన్ను ఎగవేత, నల్లధనం సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలు రూపొందించింది. ఇంట్లో దాచిపెట్టుకొనే డబ్బు, నగదు లావాదేవీలపై పరిమితులు విధించింది. అయితే ఇవన్నీ అందరికీ ఒకేలా వర్తించవు. తమ సంపాదన, ఖర్చు చేసే తీరును బట్టి మారుతుంటాయి.


ఎంత దాంచుకోవాలి?


వాస్తవంగా ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చో స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఇంటి యజమానులు తమకు నచ్చినంత సొమ్మును అట్టి పెట్టుకోవచ్చు. అయితే ఇంట్లో పెట్టుకొనే నగదు, చేపడుతున్న లావాదేవీల రికార్డులను భద్రంగా ఉంచుకోవడం అవసరం. ఆ డబ్బు ఎలా సంపాదించారో ఆధారాలు కచ్చితంగా ఉండాలి. ఆ సంపాదనపై పన్ను చెల్లింపు రికార్డులూ మీ వద్ద ఉండాలి.


ఆధారాలు భద్రం!


ఆదాయపన్ను నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత డబ్బైనా దాచుకోవచ్చు. ఏదేని కారణంతో దర్యాప్తు సంస్థలు ఆ మొత్తం పట్టుకుంటే దానికి సంబంధించిన సోర్స్‌ ఏంటో చెప్పాలి. అలాగే ఆదాయపన్ను రిటర్ను డిక్లరేషన్‌ (ITR Declaration) చూపించాలి. ఒకవేళ వీటిని ఇవ్వడంలో విఫలమైతే చట్టపరంగా మీపై చర్యలు తీసుకుంటారు. మీ ఇంట్లో ఆధారాలు చూపని డబ్బుంటే 137 శాతం వరకు పన్ను వర్తిస్తుందని నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ స్పష్టం చేసింది.


భారీ పెనాల్టీలు!


ఎప్పుడైనా రూ.50వేలకు పైగా నగదు డిపాజిట్‌ చేస్తున్నా, విత్‌డ్రా చేస్తున్నా పాన్‌ నంబర్‌ చూపించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ తెలిపింది. ఒకవేళ ఏడాదిలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డబ్బు డిపాజిట్‌ చేస్తే పాన్‌తో పాటు ఆధార్‌నూ ఇవ్వాలి. ఒకవేళ మీరు వీటిని చూపించకపోతే రూ.20 లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు.


నగదు లావాదేవీలపై పరిమితులు



  1. ఒక ఏడాదిలో బ్యాంకు నుంచి కోటి రూపాయల కన్నా ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్‌ చెల్లించాలి.

  2. ఒక ఏడాదిలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విలువైన నగదు లావాదేవీలు చేపడితే పెనాల్టీ విధిస్తారు. రూ.30 లక్షల కన్నా ఎక్కువ

  3. నగదుతో ప్రాపర్టీ కొనుగోలు చేసినా, అమ్మినా దర్యాప్తు తప్పదు.

  4. ఏదైనా కొనుగోలు చేసేందుకు రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఆధార్‌, పాన్‌ కచ్చితంగా చూపించాలి.

  5. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో ఒకేసారి రూ.లక్షకు మించి లావాదేవీలు చేపడితే దర్యాప్తు చేస్తారు.

  6. మీ బంధువుల నుంచి ఒక రోజులో రూ.2 లక్షల మించి నగదు తీసుకోకూడదు. అదీ బ్యాంకు ద్వారానే తీసుకోవాలి.

  7. ఎవ్వరి నుంచీ రూ.20వేలకు మంచి నగదు రూపంలో అప్పు తీసుకోకూడదు. రూ.2000కు మించి నగదు రూపంలో విరాళం ఇవ్వకూడదు.


Also Read: నెలకు రూ.12,500 కట్టండి చాలు, ఏకంగా కోటి రూపాయలు మీ చేతికొస్తాయి


Also Read: ఆధార్‌ కార్డ్‌లో అడ్రెస్‌ను సింపుల్‌గా మార్చుకోండి, స్టెప్‌ బై స్టెబ్‌ గైడ్‌ ఇదిగో