Deepika Kumari Success Story: క్రీడ‌లు అన‌గానే మ‌న‌కి గుర్తొచ్చేది. ముందుగా క్రికెట్‌. మ‌న దేశంలో క్రికెట్ ని మ‌తంలా, క్రికెట‌ర్ల‌ని     దేవుళ్లలా కొలుస్తాం. ఇక మ‌న జాతీయ క్రీడ అయిన హాకీని, బ్యాడ్మింట‌న్‌ని, క‌బ‌డ్డీ, ఫుట్‌బాల్‌ లాంటి ఆట‌ల‌ని త‌ప్ప మిగిలిన ఆట‌ల‌ను చూడ‌ం. తెలుసుకోడానికి కూడా ఆస‌క్తి చూపించం. కానీ అలాంటి  ప‌రిస్థితుల మ‌ధ్య‌ కూడా.. ఆర్చ‌రీ లాంటి క్రీడ‌లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డ‌మే కాకుండా 2012లో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచారు దీపికా కుమారి.


దీపికా కుమారి 1994 జూన్‌లో బిహార్‌లో పుట్టింది. అభివృద్ధి అంత‌గా లేని బీహార్ లో ఇంకా క్రీడ‌ల ప‌ట్ల ఎలాంటి ఇంట్ర‌స్ట్ ఉంటుందో ఊహించొచ్చు. మ‌రి అక్క‌డే ప్ర‌కాశించింది దీపికా. మూడుసార్లు ఒలింపియ‌న్ అయిన దీపికా కుమారి 2021 టోక్యో ఒలింపిక్స్ లో 3 బంగారు ప‌తకాలు సాధించి దేశ త్రివ‌ర్ణ‌ ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించారు. అంతే కాదు అంత‌ర్జాతీయంగా ఎన్నో ప‌త‌కాలను సాధించి విలువిద్య‌లో త‌న‌కు సాటిలేర‌ని నిరూపించ‌డ‌మే కాక మ‌న‌దేశంలో ఎంద‌రో, ఆర్చ‌రీ క్రీడాకారులుగా మార‌డానికి దోహ‌ద‌ప‌డ్డారు. మ‌రి ఈ స్థాయిలో దీపికా కుమారి ప‌త‌కాల పంట పండించడం ఎలా సాధ్య‌మ‌య్యింది అంటే ఆట ప‌ట్ల త‌న‌కున్న ప్రేమ‌, దేశం కోసం పత‌కం సాధించాల‌న్న త‌ప‌న అని చెప్ప‌క త‌ప్ప‌దు. 


ఆ విజయం వెనుక


దీపికా కుమారి త‌న ప్రాక్టీస్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌దు. ఎంత‌లా అంటే 7 నెల‌ల గ‌ర్భిణీ అయ్యుండి కూడా  44 పౌండ్లు అంటే సుమారు 20 కేజీల విల్లుతో ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. అంతేకాదు, ఎవ‌రైనా పాప పుట్టిన త‌ర్వాత సాధారణంగా ఇంటిపట్టునే ఉండి బిడ్డ ఆలనాపాలనా చూసుకోవాలి. కానీ, పాప పుట్టిన 20 రోజులకే విల్లు పట్టుకుని మైదానంలో అడుగుపెట్టి ఆటపై నిబద్ధత, ప్రేమ చాటుకున్నారు దీపిక. పాపకి పాలు ప‌ట్ట‌డం కూడా గ్రౌండ్ లోనే చేసి త‌ల్లిగా కూడా త‌న బాధ్య‌త నెర‌వేర్చారు. ప‌సిపాపని అలా ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేకున్నా ఆట‌కోసం త‌ప్ప‌లేదు అంటుంది దీపికా కుమారి.


2020లో తోటి ఆర్చ‌రీ క్రీడాకారుడు అతాన్‌దాస్ ను వివాహం చేసుకొన్న దీపికా ఆ త‌ర్వాత మిక్స్‌డ్ డ‌బుల్స్ లో భ‌ర్త‌తోనే క‌లిసి ఆడి బంగారు ప‌త‌కాన్ని సాధించారు. మొత్తం ఆర్చ‌రీ క్రీడాకారుల‌నే ఇన్ స్పైర్ చేసిన విష‌యం ఇదీ అంటారు. ఆట ప‌ట్ల వాళ్ల‌కున్న చిత్త‌శుద్ధి అని మెచ్చుకొంటారు తోటి ఆట‌గాళ్లు. ఆర్చ‌రీలో దీపికా సేవ‌ల‌కు గానూ ఎన్నో అవార్డులు దీపికాను వ‌రించాయి. కేంద్ర‌ ప్ర‌భుత్వం అర్జున అవార్డుతో పాటు, ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో ఆమెను గౌర‌వించింది. ఇక తాజాగా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జరిగిన ఆసియా కప్ 2024లో భారత్ 9 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యంతో సహా 14 పతకాలు సాధించారు. ఆసియా క‌ప్ ఆర్చ‌రీ విభాగంలో గోల్డ్ సాధించింది దీపికా కుమారి. ఈ పోటీల్లో దీపికా విసిరిన బాణం గోల్డ్ తో తిరిగొచ్చింది. దీంతో ఇప్పుడు దీపికా కుమారి 2024లో జ‌రిగే ఒలింపిక్స్ పై దృష్ఠిపెట్టారు. మ‌న దీపికా అక్క‌డ‌ కూడా ప‌త‌కాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ దీపికా కుమారి.