Breaking News Live Telugu Updates: ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 05 Feb 2023 10:52 PM
Background
సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో తాజాగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల...More
సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో తాజాగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధరణంగా ఉండగా, ఇప్పుడు మరింత పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.ఆరెంజ్ అలర్ట్ ఈ మూడు జిల్లాల్లోఆదిలాబాద్, కుమ్రుం భీమ్, మంచిర్యాల జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ ఉంది. కరీంనగర్, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 9.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది.ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ మాత్రం ఎలాంటి వెదర్ బులెటిన్ విడుదల చేయలేదు. రెండు రోజుల క్రితం విడుదల చేసిన బులెటిన్‌లో చెప్పిన వివరాల ప్రకారం... ఈ మధ్య శ్రీలంకలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంపై పెద్దగా ఉండబోదని తెలిపింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన కూడా లేదని తేల్చేసింది. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి గణనీయంగా తగ్గింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు, లోతట్టు మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉదయం, సాయంత్రం పొగమంచు కనిపిస్తోంది.బంగారం, వెండి ధరలుGold-Silver Price 05 February 2023: పసిడి ధర భారీగా దిగి వచ్చింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 700, స్వచ్ఛమైన పసిడి ₹ 770 చొప్పున తగ్గింది. బిస్కట్ బంగారం ధర ఈ రెండు రోజుల్లోనే ₹1200 మేర పడిపోయింది. కిలో వెండి ధర కూడా ఒకేసారి ₹ 2,600 క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,160 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,400 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,160 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,200 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి
జగిత్యాల ధరూర్ క్యాంప్ ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు...
కారులో ఐదుగురు ప్రయాణిస్తున్న యువకులు
జగిత్యాల బీట్ బజార్ కు చెందిన రిజ్వాన్ అనే యువకుడు మృతి