Breaking News Live Telugu Updates: చంద్రబాబు సభలో అపశృతి, కాల్వలో పడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Dec 2022 08:33 PM

Background

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న (డిసెంబరు 26) మాల్దీవులు, దానిని ఆనుకొని ఉన్న కొమోరిన్ ప్రాంతం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం బలహీనపడిందని తెలిపారు....More

చంద్రబాబు సభలో అపశృతి, కాల్వలో పడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు

నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఇద్దరు కార్యకర్తలు చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కాల్వ నుంచి బటయకు తీసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.