Breaking News Live: రేపు హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ...

Advertisement

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 23 Nov 2021 06:20 PM
రేపు హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ...

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం తన కుమారుడు రైహాన్ తో సహా హైదరాబాద్ వస్తున్నారు. రైహాన్ కంటి గాయానికి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నరేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి దెబ్బ తగిలింది. దిల్లీ ఎయిమ్స్ వైద్యులు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసువెళ్లాలని సూచించారు. అప్పట్లో హైదరాబాద్ లో చికిత్స పొందిన రైహాన్ ను మరోసారి తీసుకువస్తున్నారు. చికిత్స అనంతరం రేపు సాయంత్రం దిల్లీ తిరుగు పయనం కానున్నారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్ పూర్తిపేరు రైహాన్ రాజీవ్ వాద్రా. రైహాన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు

Continues below advertisement
వెంకట్రామిరెడ్డితో క్షమాపణ చెప్పిస్తాం... హైకోర్టుకు తెలిపిన ఏజీ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి తెలంగాణ హైకోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వరి విత్తనాలు వేయొద్దని వెంకట్రామిరెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోమన్నారని వెంకట్రామిరెడ్డి అన్నారని పిటిషనర్ ఆరోపించారు. సింగిల్‌ జడ్జి సిఫార్సు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని వెంకట్రామిరెడ్డిని హైకోర్టు ఆదేశించగా.. వెంకట్రామిరెడ్డితో క్షమాపణ చెప్పిస్తామని ఏజీ తెలిపారు. విచారణను హైకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది.

Background

హైద‌రాబాద్ నాన‌క్‌రామ్‌ గూడ‌లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ఈ పేలుడు ధాటికి భ‌వ‌నం చాలా వరకూ ధ్వంసం కాగా, ఒక‌రు మృతి చెందారు. మ‌రో 9 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షత‌గాత్రుల‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించారు. వీరిలో ఇద్దరి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్టర్లు తెలిపారు. దీంతో బాధిత కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ్యాస్ సిలిండ‌ర్ పేలుడు శ‌బ్దం విని స్థానికులు ఉలిక్కిప‌డ్డారు.


లెక్కలు లేని సొమ్ము సీజ్
ఓ కారులో ముగ్గురు వ్యక్తులు ఎలాంటి లెక్కలు లేకుండా తీసుకెళ్తున్న రూ.కోటి నగదును నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఆపి తనిఖీ చేయగా ఆ నగదు బయటపడింది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో భాగంగా వారు రూ.కోటి రూపాయలను నగదుగా హ్యాకర్‌లకు ఇస్తే వారు ఇతరుల బ్యాంక్‌ అకౌంట్ల నుంచి తస్కరించి తమకు రూ.2 కోట్లను బ్యాంక్‌ అకౌంట్‌లలోకి వేస్తారని అంగీకరించారని మాదాపూర్‌ పోలీసులు వెల్లడించారు.


తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నాలుగు రోజులుగా స్థిరమైన ధరలే ఉంటున్నాయి. పెట్రోల్ ధర కూడా స్థిరంగా ఉండి రూ.107.69 గానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.94.14గా నిలకడగానే ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.57 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.36 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.51 పైసలు తగ్గి రూ.96.45గా ఉంది.


స్థిరంగా బంగారం, వెండి ధరలు
ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,740 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,900 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.70,400గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విజయవాడలోనూ పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,740 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,900గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,400గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,740 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,400 గా ఉంది.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.