Attack On Sarpanch :   మహబూబాబాద్ జిల్లాలో ఓ యువకుడు గ్రామసభలో సర్పంచ్ ను చెప్పుతో కొట్టిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.  గ్రామంలో అభివృద్ధి పనుల్లో నిధులు గోల్ మాల్ చేశారని ఆరోపిస్తూ  అందరిముందు చెప్పుతో కొట్టాడు.  మహబూబాబాద్ మండలం మోట్ల తండాలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో గ్రామంలో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా  సర్పంచ్ బానోత్ సుమన్ నాయక్ను వర్రే మహేష్ అనే యువకుడు నిధులపై ప్రశ్నించాడు. అభివృద్ధి పేరుతో నిధులను మింగేశారని ఆరోపిస్తూ చెప్పుతో దాడి చేశాడు.  అయితే గ్రామంలో చేసిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వ్యక్తిగత కక్షతో తనపై చెప్పుతో దాడి చేశారని సర్పంచ్ బానోతు సుమన్ నాయక్ ఆరోపించారు. 


టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో శ్రీవారి ఆలయం - శంకుస్థాన చేసిన మంత్రి గంగుల, వైవీ సుబ్బారెడ్డి                                                       
 
గ్రామ సభ జరుగుతుండగా గ్రామస్థుడు  వర్రే మహేష్ దూసుకవచ్చి సర్పంచ్ గ్రామంలో అబివృద్ది పనులు జరగకుండానే బిల్లులను సర్పంచ్ కాజేశారని ఆరోపించారు.  అసభ్య పదజాలంతో దూషించి చెప్పుతో దాడి చేశారు.  మహేష్ చర్యతో  గ్రామస్తులకు , సర్పంచ్ వర్గీయుల మధ్య ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాగ్వాదం చోటు చేసుకొని తోపులాట కు దారి తీసింది. , ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   ఈ సంఘటనతో నివ్వరపోయిన గ్రామ కార్యదర్శి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకి  ఈ నెల 5వ తేదీకి  గ్రామసభను వాయిదా వేసి  సభను ముగించారు.




వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు, అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు                                                       


గ్రామంలో చేస్తున్న అబివృద్ధిని చూసి ఓర్వలేకనే నాపై వ్యక్తిగత కక్షతోనే నా పై  వర్రే మహేష్ దాడి చేశారని సర్పంచ్ ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన మహేష్ పై చర్యలు తీసుకొని గిరిజన సర్పంచ్ కు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నారు. గ్రామ రాజకీయాల కారణంగానే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. సర్పంచ్ పైనే చెప్పుతో దాడికి దిగిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మరింది. వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  సర్పంచ్ పై దాడి చేసిన యువకుడు మహేష్ పై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.