Actor Rahul Ramakrishna tweets to KCR and KTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్క సారి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ, సోషల్ మీడియాలో తన యాక్టివిటీతో పాటు ఇటీవల రాజకీయ విమర్శలతో కూడా చర్చనీయాంశమయ్యారు. X లో వరుసగా పోస్ట్ చేసిన ట్వీట్లలో అతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే డైరెక్ట్‌గా టార్గెట్ చేయకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు మాత్రమే విజ్ఞప్తులు చేశాడు. ఈ ట్వీట్లు భారత రాష్ట్ర సమితి సపోర్టర్లు వైరల్ చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ యొక్క X అకౌంట్ (@eyrahul)లో ఈ రోజు మధ్యాహ్నం పోస్ట్ చేసిన ట్వీట్‌లో, "హైదరాబాద్ మునిగిపోయింది. మీ వాగ్దానాలు అన్నీ విఫలమయ్యాయి. @KCRBRSPresident ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతిదాన్నీ క్రమబద్ధీకరించమని" అని రాశాడు. ఈ పోస్ట్ 2 గంటల్లోనే 98,000కి పైగా వ్యూస్, 2,000 లైక్‌లు పొందింది. హైదరాబాద్ వర్షాలు, వరదల సమస్యలను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వ వాగ్దానాలు ఏమీ ఫలితం ఇవ్వకపోవడాన్ని ఇందులో పరోక్షంగా విమర్శించినట్లుగాభావిస్తున్నారు.
అలాగే, ఈ రోజు ఉదయం మరో ట్వీట్‌లో "మనం చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము. వేచి ఉండలేను.. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని @KTRBRS" అని పేర్కొన్నాడు. కేటీఆర్‌ను 'రక్షకుడిగా' పిలుస్తూ, "ఇప్పుడు నన్ను చంపేయండి, నాకు ఏమీ ఆశ లేదు" అని భావోద్వేగంగా ముగించాడు. ఈ పోస్ట్ 1.5 లక్షల వ్యూస్‌కు చేరింది.
రాహుల్ రామకృష్ణ, సోషల్ మీడియాలో సాధారణంగా సినిమా, సామాజిక అంశాలపై మాట్లాడతారు. మరో పోస్ట్‌లో "ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు, మనం మానవులమే.. ప్రేమతో జీవించాలి" అని శాంతి సందేశం ఇచ్చాడు. అయితే, ఈ ట్వీట్లు రాజకీయ రంగంలో ఆందోళన కలిగించాయి.
కాంగ్రెస్ కార్యకర్తలు కామెంట్లలో "రాహుల్ గారు, మీకు ఏమైంది? ఎందుకు ఇప్పుడు KCR, KTRకు మాత్రమే?" అ ని ప్రశ్నిస్తున్నారు. ఒక కార్యకర్త "హైదరాబాద్ వరదలపై ఇప్పుడు రాజకీయ టార్గెట్ కోసం గుర్తు చేస్తున్నారు" అని ప్రశ్నించారు.
అయితే ఈ ట్వీట్లు ఎందుకు పెట్టారని..తనపై వస్తున్న కామెటంల్కు రాహుల్ రామకృష్ణకు ఇప్పటివరకు ఏ అధికారిక స్పందన లేదు,