Kantara Chapter 1 Sequel Story: ఓ మట్టి కథ... దైవం కోసం ఓ తెగకు తన రాజ్యంలో భూమిని ఇచ్చే ఓ రాజు కథ. భూమి కోసం రాజు వారసులు దైవ గణాలనే ధిక్కరించిన కథ. దైవ శక్తి బలంతో అధర్మంపై ధర్మం గెలిచిన చరిత్ర. శివుని గణాలతో పాటు ఆచారం, సంస్కృతి సంప్రదాయాలను అందరికీ చూపించే అద్భుతం 'కాంతార'. దీనికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' విజయదశమి సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Continues below advertisement

తన తండ్రి మాయమైన పవిత్రమైన స్థలం నుంచే ఓ కొడుకుకు ఎదురైన ప్రశ్నకు సమాధానమే 'కాంతార చాప్టర్ 1'. అంతకు ముందు అసలు కథను ఈ మూవీలో చూపించగా దీనికి సీక్వెల్ సైతం ఉంటుందంటూ హింట్ ఇచ్చింది మూవీ టీం. పంజుర్లి, గులిగ వంటి దైవిక గణాల వెనుక ఉన్న స్టోరీని టచ్ చేస్తూ... ఆ మూలాల్ని అన్వేషిస్తూ ఈ స్టోరీ సాగుతుంది. 

అసలు స్టోరీ ఏంటంటే?

Continues below advertisement

8వ శతాబ్దపు కదంబుల రాజ్య పాలనలో ఓ దిక్కున అటవీ ప్రాంతంలో ఉన్న దైవిక భూమి 'కాంతార'. అందులో ప్రసిద్ధి చెందిన 'ఈశ్వరుని పూదోట', 'మార్మిక బావి'. ఆ రెండింటిపై ఏ దుష్ట శక్తి కన్ను పడకుండా... ఎవరూ ఆక్రమించకుండా కాపాడుతుంటారు అక్కడి తెగ వారు. అక్కడ బావిలో దొరికిన బిడ్డ 'బెర్మె' (రిషబ్ శెట్టి)ను దైవ ప్రసాదంగా భావించి పెంచుతారు 'కాంతార' తెగ వారు. పెరిగి పెద్దైన తర్వాత తమ భూమిలోకి అడుగు పెట్టిన భాంగ్రా యువరాజు, అతని సైనిక మూకకు బుద్ధి చెప్తాడు బెర్మె.

ఈశ్వరుని పూదోట మీద కన్నేసిన భాంగ్రా రాజు సొంతం చేసుకోవాలని అనుకోగా... ఈశ్వర గణాలు కన్నెర్ర చేస్తాయి. దీంతో రాజు మరణించగా... మహారాజు కుమారుడు రాజశేఖరుడు (జయరాం) 'కాంతార' జోలికి వెళ్లడు. అయితే అతని కుమారుడు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) తండ్రి మాటను ధిక్కరిస్తూ 'కాంతార' తెగను ఇబ్బంది పెడతాడు. అక్కడి వారిని ఊచకోత కోస్తాడు. రాజును ఎదిరించి సొంతంగా అడవిలో సుగంధ ద్రవ్యాలతో వ్యాపారం చేస్తుంటాడు బెర్మె. మరోవైపు, కులశేఖరుడు సోదరి కనకవతి (రుక్మిణి వసంత్)... బెర్మెను ఇష్టపడుతుంది. దీంతో 'కాంతార' తెగపై మరింత పగ పెంచుకుంటాడు కులశేఖరుడు. దీంతో రాజు, అతని సైన్యం బారి నుంచి బెర్మె తన తెగను ఎలా కాపాడాడు ? దైవ భూమిగా పేరొందిన కాంతార తెగకు దైవ గణాలు ఏం సాయం చేశాయి? అసలు ఈశ్వరుని పూదోట దైవిక భూమి రహస్యం ఏంటి? అనేది తెలియాలంటే 'కాంతార చాప్టర్ 1' మూవీ చూడాల్సిందే.

Also Read: భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన 'కాంతార'... ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌ రిపోర్ట్... కలెక్షన్లలో కుమ్ముడే

అడవి తల్లి ఒడిలో దైవ రహస్యం

తన అహంకారానికి, ఆర్భాటానికి, ఆధిపత్యానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో అడవి తెగను నాశనం చేయాలనుకునే రాజు... దైవ గణాల అండతో రాజును ఎదిరించే తెగ నాయకుడు. దైవ భూమిలో దాగి ఉన్న అరుదైన రహస్యాలు. రాజ కుమార్తె... తెగ నాయకుడిని ఇష్టపడే కోణం... ఓ అడవి తల్లి ఒడిలో దాగిన అరుదైన దైవ రహస్యాలతో పాటు బానిసత్వాన్ని ఎదిరించే ఓ తెగ నాయకుడి కథను 'కాంతార చాప్టర్ 1'లో అద్భుతంగా చూపించారు.

ఫస్ట్ పార్ట్‌ను మించి ప్రీక్వెల్... ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను అంతకు మించి ఉంటుందనే సినిమా చూసిన ఆడియన్స్‌కు ఈ పాటికే అర్థమైపోతుంది. మరి ఈ సీక్వెల్‌లో ఏ దైవ కోణాన్ని లేదా జానపదం, సంస్కృతి, సంప్రదాయాలను టచ్ చేస్తారో తెలియాల్సి ఉంది.