Nayanthara Look From Mookuthi Amman 2 Movie: స్టార్ హీరోయిన్ నయనతార లేటెస్ట్ మూవీ 'మూకుతి అమ్మన్ 2' నుంచి దసరా సందర్భంగా బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. మూవీలో మరోసారి అమ్మవారి పాత్రలో నయన్ కనిపించనున్నారు. ఆమె లుక్‌ను తాజాగా రివీల్ చేశారు మేకర్స్.
శాంతి స్వరూపిణిగా...
చేతిలో త్రిశూలంతో శాంతి స్వరూపిణి మెట్లపై కూర్చున్నట్లుగా ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'ఆమె దైవ కృప ప్రబలంగా ఉండనివ్వండి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ 'మూకుతి అమ్మన్'కు సీక్వెల్‌గా 'మూకుత్తి అమ్మన్ 2'ను రూపొందిస్తున్నారు. తెలుగులో ఫస్ట్ పార్ట్ 'అమ్మోరు తల్లి'గా రీమేక్ చేస్తే... ఇప్పుడు సీక్వెల్ 'మహాశక్తి'గా రానుంది. ఈ మూవీ సుందర్.సి దర్శకత్వం వహిస్తుండగా... నయనతారతో పాటు రెజీనా, యోగిబాబు, దునియా విజయ్, ఊర్వశి, అభినయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా... రెండో పార్ట్ అంతకు మించి ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవనీ సినిమాక్స్, IVY ఎంటర్‌టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా... డా.ఇషారి గణేష్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించనున్నారు.
Also Read: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్