'కాంతార ఛాప్టర్ 1'తో బాక్స్ ఆఫీస్ బరిలో భారీ ఓపెనింగ్ మీద కన్నేశాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. మొదటి రోజు ఈ సినిమా బంపర్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఆల్రెడీ బుధవారం రాత్రి బెంగళూరు, చెన్నై నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్ కూడా బావుంది. మరి మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందో తెలుసా?
'కాంతార' ఓపెనింగ్ @ 30 కోట్లు ప్లస్!Kantara A Legend Chapter 1 First Day Collection: మూడేళ్ళ క్రితం విడుదలైన 'కాంతార'కు ప్రీక్వెల్ కింద తెరకెక్కిన 'కాంతార ఛాప్టర్ 1'కు బజ్ బావుంది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించింది. మరీ ముఖ్యంగా కర్ణాటకలో సినిమాకు బంపర్ ఓపెనింగ్ లభించింది.
గురువారం ఉదయం ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం... కర్ణాటక, అలాగే ఇతర ప్రాంతాల్లో విడుదల అవుతున్న కన్నడ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పది కోట్లకు పైగా వచ్చాయి. తెలుగు ఆడియన్స్ సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడానికి అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. 'కాంతార 2' తెలుగు వెర్షన్ కలెక్షన్స్ 3 కోట్లకు పైమాటే. తమిళంలో కోటిన్నర, హిందీలో ఐదు కోట్లు, మలయాళంలో కోటిన్నర వచ్చాయి.
Also Read: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?
Kantara Chapter 1 First Day Collection Prediction: ట్రేడ్ వర్గాల నుంచి గురువారం ఉదయానికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం... ఆల్మోస్ట్ 20 కోట్ల గ్రాస్ వచ్చింది. బ్లాక్ చేసిన సీట్లతో చూస్తే... వరల్డ్ వైడ్ 30 కోట్లకు పైగా గ్రాస్ వస్తుంది. గురువారం బుకింగ్స్ ఉంటాయి. అలాగే, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు డైరెక్టుగా వచ్చి టికెట్స్ తీసుకునే ఆడియన్స్ ఉంటారు. అందువల్ల మొదటి రోజు 50 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. కలెక్షన్లలో సినిమా కుమ్ముతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: 'కాంతార చాప్టర్ 1' రివ్యూ: రిషబ్ శెట్టి మళ్ళీ సక్సెస్ కొడతారా? 'కాంతార' ప్రీక్వెల్ హిట్టా? ఫట్టా?
రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార ఛాప్టర్ 1'లో రుక్మిణీ వసంత్ హీరోయిన్. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్, చాళువే గౌడ నిర్మించారు.