Dhanush Idli Kadai Movie First Day Collection: 'రాయన్', 'కుబేర' విజయాల తర్వాత ధనుష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఇడ్లీ కొట్టు'. దీనికి దర్శకుడు కూడా ధనుషే. తమిళంలో 'ఇడ్లీ కడై'గా విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా? ఇండియాలో ఈ సినిమాకు ఎంత నెట్ కలెక్షన్ వచ్చిందో తెలుసా?

Continues below advertisement

ఇండియాలో పది కోట్లు దాటిన కలెక్షన్స్!Idli Kadai Box Office Collection Day 1: ధనుష్ లాస్ట్ సినిమా 'కుబేర'. దానికి తెలుగులో 10 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషించడంతో పాటు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన సినిమా కావడం వల్ల ఏపీ, తెలంగాణలో మంచి ఓపెనింగ్ వచ్చింది. అయితే తమిళంలో 'కుబేర' అంత భారీ ఓపెనింగ్ సాధించలేదు. అక్కడ ఆ సినిమాకు నాలుగున్నర కోట్లు మాత్రమే వచ్చింది.

'ఇడ్లీ కడై' విషయానికి వస్తే... తమిళనాడులో మంచి ఓపెనింగ్ రాబట్టింది. తెలుగు మార్కెట్ చూస్తే అంతగా ప్రేక్షక ఆదరణ లభించలేదు. ఓవరాల్ రెండు భాషల్లో కలెక్షన్ చూస్తే... ఇండియాలో మొదటి రోజు 10 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ రాబట్టింది. 'కుబేర' (14.75) కంటే కాస్త వెనుకబడింది.

Continues below advertisement

Also Read: 'కాంతార చాప్టర్ 1' రివ్యూ: రిషబ్ శెట్టి మళ్ళీ సక్సెస్ కొడతారా? 'కాంతార' ప్రీక్వెల్ హిట్టా? ఫట్టా?

'ఇడ్లీ కొట్టు' కథలో హ్యూమన్ ఎమోషన్స్ అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. అయితే ధనుష్ తెరకెక్కించిన విధానంలో తమిళ ఫ్లేవర్ ఎక్కువ కనిపించింది. అందువల్ల, తెలుగులో ఈ సినిమాకు ఎటువంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. మరోవైపు భారీ బడ్జెట్ ఫాంటసీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'కాంతార ఛాప్టర్ 1'ను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత బలంగా నిలబడుతుందో అని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 

Also Read'ఇడ్లీ కొట్టు' రివ్యూ: ధనుష్ డైరెక్షన్ చేసిన సినిమా - ఫాదర్ సెంటిమెంట్, పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ కనెక్ట్ అవుతాయా?

ధనుష్ సరసన నిత్యా మీనన్ కథానాయికగా నటించిన 'ఇడ్లీ కొట్టు' సినిమాలో అరుణ్ విజయ్ విలన్. హీరోగా తండ్రిగా రాజ్ కిరణ్, విలన్ తండ్రిగా సత్యరాజ్ నటించారు. షాలినీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రాణం పోసింది.