ABP Southern Rising Summit 2024: ప్రస్తుతం ర్యాపిడో నెట్‌వర్క్‌లో 20 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉన్నారని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంకా అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో కంపెనీ గురించి మాట్లాడారు. తమ సంస్థ ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఇది వారిని మోటివేటెడ్‌గా ఉంచుతుందని పేర్కొన్నారు.
అలాగే ర్యాపిడోను ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే ఏది వేరుగా ఉంచుతుందో కూడా తెలిపారు. తాము డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్ తీసుకోమని అన్నారు. అరవింద్ సంకా సోషల్ మీడియాలో లేకపోవడం గురించి కూడా సెషన్‌ను నిర్వహిస్తున్న చేతన్ భగత్ అడిగారు. సోషల్ మీడియాలో ఉండటం గల ప్రయోజనాలను ఒప్పుకుంటూనే... తాను మాత్రం సోషల్ మీడియా ఉపయోగించబోమని అరవింద్ అన్నారు.
అలాగే ప్రస్తుతం బాగా పెరుగుతున్న ఏఐ ప్రాముఖ్యత గురించి కూడా అరవింద్ సంకా మాట్లాడారు. ఏఐ అనేది బిజినెస్‌లో ప్రొడక్టివిటీని పెంచుతుందన్న మాట నిజమే కానీ... ట్రాన్స్‌పొర్టేషన్ రంగంలో దానికి పెద్దగా స్కోప్ ఉందని తాను అనుకోవడం లేదని ఆయన తెలిపారు.