ABP Southern Rising Summit 2024: రష్యాలో అక్కడి ప్రజలు రాజ్ కపూర్ గురించి మాట్లాడుకోవడం తాము విన్నామని సంగీతానికి ఉన్న శక్తి అలాంటిదని ప్రముఖ సింగర్, సాపా సంస్థ సహ వ్యవస్థాపకులు సీఈవో బిందు సుబ్రమణ్యం అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరుగుతున్న ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో బిందు సుబ్రమణ్యం పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో ఆమె ఇంకా మాట్లాడుతూ... ‘నేను చాలా మామూలు వాతావరణంలో పెరిగాను. అందరూ అలానే పెరుగుతారు. ఫేమ్ ఎప్పుడు వస్తుందనే దానిపై మనకు కంట్రోల్ ఉండదు. కానీ మనం రోజూ చేసే పని ఎంత బాగా చేస్తున్నామనే దానిపై మనకు కంట్రోల్ ఉంటుంది. మేం చిన్న వయసులోనే ప్రపంచం అంతా తిరిగాం. వేర్వేరు రకాల సంగీత విద్యాంసులని, వేర్వేరు సంస్కృతులను చూశాం. సంస్కృతులను కలిపేలా ఏదైనా చేయాలని నాకు అప్పట్నుంచే అనిపించేది.’


‘మనం వేర్వేరు ప్రదేశాలకు వెళ్లినప్పుడు రకరకాల పరిస్థితులను చూస్తాం. ఉదాహరణకు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాలకు మధ్య ఉన్న తేడా. ఇండియా, ఆఫ్రికాల మధ్య ఉన్న తేడా, ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య ఉన్న తేడాలను గమనించవచ్చు. వేర్వేరు సంస్కృతులను మీరు ఫెమిలియర్‌గా అప్రోచ్ అయితే మీరు బెటర్ స్పేస్‌లో ఉన్నట్లే. ఒక ఆర్టిస్ట్‌గా నేను వీటిని కలపడంపై దృష్టి పెట్టాను.’


‘ప్రపంచ పటంపై భారత సాంస్కృతిక సంగీతం పాత్ర ఏంటి అని ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు... మ్యూజిక్, ఫుడ్, డ్యాన్స్ విషయాల్లో భారత్ తన గురించి తాను నొక్కి చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ మూడు విషయాలూ భారతీయుల మూలాల్లోనే ఉన్నాయని చెప్పవచ్చు. మేం రష్యాలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు రాజ్ కపూర్ గురించి మాట్లాడుకోవడం విన్నాం.’ అన్నారు.


అంతే కాకుండా ఆమె కొన్ని పాటలు పాడి ఈవెంట్‌కు వచ్చిన వారిని అలరించారు. ఆమె పాడిన పాటలకు శ్రోతల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.