Man Died Due To Egg Bajji Stucked In His Throat in Vanaparthi: మృత్యువు ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకూ మనతో ఉన్న వారే అనుకోని సంఘటనలతో ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఓ వ్యక్తి తనకు ఇష్టమైన కోడిగుడ్డు బజ్జీ తింటుండగా.. అది గొంతులో ఇరుక్కుని అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటన వనపర్తిలో (Vanaparthy) విషాదం నింపింది. మదనాపురం మండలం గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్యకు బజ్జీలు అంటే చాలా ఇష్టం. గురువారం సాయంత్రం ఇంటి బయట కూర్చుని కోడిగుడ్డు బజ్జీ (Egg Bajji) తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. భర్తను గమనించిన భార్య కోడిగుడ్డును తీసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఇరుగు పొరుగు వారు వచ్చి అతని గొంతులో ఇరుక్కున్న బజ్జీని బయటకు తీశారు. అయితే, అప్పటికే తిరుపతయ్య ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే భర్త మరణాన్ని చూసిన భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. అప్పటి వరకూ తమతో ఉన్న వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Vanaparthi News; ఊపిరి తీసిన ఎగ్ బజ్జీ - గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి, ఎక్కడంటే?
ABP Desam
Updated at:
01 Mar 2024 12:24 PM (IST)
Egg Bajji: కోడిగుడ్డు బజ్జీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. బజ్జీ తింటుండగా అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తిలో జరిగింది.
కోడిగుడ్డు బజ్జీ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి