తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. 24 గంటల వ్యవధిలో 1,11,178 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,557 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మెుత్తం..7,18,196కు చేరాయి.  వైరస్ కారణంగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మెుత్తం 4,065 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వైరస్ బారి నుంచి కొత్తగా 1,773 మంది బాధితులు కోలుకున్నారు.  ప్రస్తుతం 24,253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మరోవైపు రోజువారి కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 2,82,970 కరోనా కేసులు నమోదుకాగా 441 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చెరింది. మంగళవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 18 శాతం పెరిగింది. 


1,88,157 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 15.13గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.83గా ఉంది.


రాష్ట్రాలవారీగా..


మహారాష్ట్రలో కొత్తగా 39,207 కరోనా కేసులు నమోదయ్యాయి. 53 మంది కరోనా కారణంగా మృతి చెందారు.


దిల్లీలో కొత్తగా 11,684 మందికి కరోనా సోకింది. 38 మంది మృతి చెందారు. దిల్లీ పాజిటివిటీ రేటు 22కు తగ్గింది.


గుజరాత్‌లో కొత్తగా 17,119 కరోనా కేసులు నమోదయ్యాయి. 


జమ్ముకశ్మీర్‌లో కొత్తగా 4,651 మందికి కరోనా సోకింది ముగ్గురు మృతి చెందారు.


అసోంలో ఒక్కరోజులో 8,072 కేసులు నమోదయ్యాయి. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి అసోంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.


వ్యాక్సినేషన్


దేశంలో ఇప్పటివరకు 158 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.


Also Read: AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..


Also Read: Visakha Corona Cases: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు


Also Read: CS Sameer Sharma: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు


Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!


Also Read: Nellore Crime: నెల్లూరులో చిన్నారి కిడ్నాప్... తిరుపతిలో అమ్మకానికి పెట్టిన ఆటోడ్రైవర్... 24 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు



Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి