Zoom Update: వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ దాని వెబ్‌నార్ కెపాసిటీని ఒక్కసారిగా అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు 10 లక్షల మంది వ్యూయర్స్ ఒకే కాల్‌లో ఒకేసారి కనెక్ట్ అవ్వవచ్చు. హై ప్రొఫైల్ రాజకీయ నిధుల సేకరణ ఈవెంట్లలో ఎక్కువ మంది పాల్గొంటున్న కారణంగా జూమ్ దాని కెపాసిటీని అప్‌గ్రేడ్ చేసింది.


కొత్త అప్‌డేట్ ఇదే...
ఈ కొత్త అప్‌డేట్‌లో కస్టమర్‌లు ఏకకాలంలో 10 వేల నుంచి 10 లక్షల మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. జూమ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ స్మితా హషీమ్ మాట్లాడుతూ... ‘ఈ అప్‌డేట్ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తోంది." వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ఇటీవలి నిధుల సేకరణ కార్యక్రమాల తర్వాత జూమ్ ఈ అప్‌గ్రేడ్ చేసింది. 


ఇందులో విన్ విత్ బ్లాక్ ఉమెన్ హోస్ట్ చేసిన ఇటీవలి కాల్ కూడా ఉంది. ఈ కాల్ ఒకేసారి 40 వేల కంటే ఎక్కువ మంది వ్యక్తులను కనెక్ట్ చేసింది. కేవలం మూడు గంటల్లో దాదాపు 1.5 మిలియన్ డాలర్లను సేకరించింది.






Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


రాజకీయాలకు అతీతంగా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే ఈవెంట్లను దృష్టిలో పెట్టుకుని జూమ్ దీన్ని క్రియేట్ చేసింది. ఈ ఫీచర్‌లో ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్‌లు, పబ్లిక్ సెక్టార్ ఔట్రీచ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వడం వంటి ఉపయోగాలు ఉన్నాయి. అదనంగా పెద్ద స్థాయి వర్చువల్ ఈవెంట్‌లు సజావుగా జరిగేలా చూసేందుకు ప్లాట్‌ఫారమ్ దాని ఈవెంట్ సర్వీసుల బృందంపై ఆధారపడుతుంది. 


ప్రీమియం వినియోగదారులకు మాత్రమే...
ఈ కొత్త ఫీచర్ ప్రీమియంతో మాత్రమే వస్తుందని మీకు తెలియజేద్దాం. 10 లక్షల మంది పాల్గొనేవారి కోసం వన్ టైమ్ వెబ్‌నార్ ధర లక్ష డాలర్లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.84 లక్షలు. ఇంత మంది ప్రజలు పాల్గొనే అవుట్ డోర్ మీటింగ్‌లకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి యూజర్లు ఈ కొత్త అప్‌డేట్‌ను చాలా ఇష్టపడవచ్చు. అలాగే దీనితో చాలా మందిని ఒకేసారి సులభంగా రీచ్ అవ్వచ్చు.






Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?