YouTube CEO Neal Mohan: భారత్‌లో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు మామూలుగా కాదు. పెద్ద మొత్తంలోనే సంపాదిస్తున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (Youtube) భారతీయ ‘కంటెంట్’ క్రియేటర్స్, ఆర్టిస్టులు, మీడియా సంస్థల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కంటెంట్ క్రియేటర్లపై ఏకంగారూ.850 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యూట్యూబ్ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ (YouTube CEO Neal Mohan) గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత 3 సంవత్సరాలలో యూట్యూబ్ భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లకు, ఆర్టిస్టులు, మీడియా సంస్థలకు దాదాపు రూ.21,000 కోట్లకు పైగా చెల్లించినట్లు ఆయన తెలిపారు.
భారత్‌లో ₹850 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న యూట్యూబ్
గత ఏడాది భారతదేశంలో క్రియేట్ చేసిన వీడియో కంటెంట్‌ను విదేశాలలో ఉన్న యూజర్లు ఏకంగా ఆ వీడియోలను 45 బిలియన్ గంటల పాటు చూశారు. ఇక్కడ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా నీల్ మోహన్ మాట్లాడారు. ‘వచ్చే 2 సంవత్సరాలలో భారత్ కు చెందిన యూట్యూబ్ క్రియేటర్లు, కళాకారులు, మీడియా సంస్థల అభివృద్ధిలో భాగంగా ఏకంగా ₹850 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
10 కోట్లకు పైగా కంటెంట్ అప్‌లోడ్
భారత్‌కు చెందిన ‘కంటెంట్ క్రియేటర్లు’ దేశ ప్రత్యేకతను తమ క్రియేషన్ ద్వారా చూపిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారితో అయినా మన చరిత్ర, సంస్కృతిని, టాలెంట్ షేర్ చేసుకునే ప్లాట్‌ఫాం యూబ్యూబ్ కల్పిస్తోందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టిగల నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు ఒక సాధనంగా డిజిటల్ ఫ్లాట్‌ఫాం మారింది. డిజిటల్ ఇండియాతో భారత్ ను మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు.
‘ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్‌లో 2.5 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోని ఏ నేతకు లేని స్థాయిలో యూట్యూబ్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారని నీల్ మోహన్ అన్నారు. ఆయన భారతదేశాన్ని క్రియేటివ్ పరంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ఏడాది దేశంలోని 10 కోట్లకు పైగా చానెళ్ళు యూట్యూబ్‌లో ‘కంటెంట్ అప్‌లోడ్’ చేశాయని, అందులో 15,000 కంటే ఎక్కువ చానళ్లకు 10 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
విజయవంతమైన వ్యాపారాలకు హెల్ప్ అయింది- నీల్ మోహన్
కొన్ని నెలల కింద ఉన్న 11,000 చానెళ్ళ కంటే ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్లు తమ టాలెంట్ ప్రదర్శిస్తూ మరింత ఎదగాలని, అందుకు యూట్యూబ్ వేదిక కావాలని నీల్ మోహన్ ఆకాంక్షించారు. విజయవంతంగా ఎన్నో వ్యాపారాలను నిర్వహించడంలో సహాయపడుతోందని అన్నారు.
గత 3 సంవత్సరాలలో భారత్‌లోని కంటెంట్ క్రియేటర్లు, నటీనటులు, మీడియా సంస్థలకు ₹21,000 కోట్లకు పైగా చెల్లించామని.. ఇది పెద్ద మార్కెట్ అన్నారు. ఏ ప్రదేశంలోని కంటెంట్ క్రియేటర్ అయినా ప్రపంచవ్యాప్తంగా తమకు ఫాలోయర్లు సంపాదించుకుంటారు. యూట్యూబ్‌ను ఒక శక్తివంతమైన ఇంజిన్‌గా మార్చడంతో కొన్ని దేశాలు మాత్రమే భారతదేశంలాగ ఫలితాలు పొందుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా చేయనున్న ఇన్వెస్టిమెంట్ ద్వారా దేశంలో కంటెంట్ క్రియేటర్లు మరింత మార్కెట్ చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.