Lamborghini Temerario Price And Features: ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లను తయారు చేసే లంబోర్గిని, తన Huracan సిరీస్‌ ఎక్స్‌టెన్షన్‌ మోడల్‌ 'టెమెరారియో'ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇది అత్యధిక పనితీరును ప్రదర్శించే హైబ్రిడ్ సూపర్‌కార్. లంబోర్గిని కార్‌లలో అమర్చే శక్తిమంతమైన ఇంజిన్ & అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ పాపులారిటీ వేరే లెవెల్‌లో ఉంటుంది. కోట్లు విలువైన లాంబోర్గిని కార్‌లను సంపన్నులు మాత్రమే భరించగరు, ఈ బ్రాండ్‌ను తమ గరాజ్‌లో పార్క్‌ చేశామని గర్వంగా చెప్పుకుంటారు. లాంబోర్గిని ఉండడం హోదాకు చిహ్నంగా భావిస్తారు.

నిజానికి, టెమెరారియో అంతర్జాతీయ మార్కెట్లో 9 నెలల క్రితమే లాంచ్‌ అయింది & ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర (Lamborghini Temerario Ex-show room price) దాదాపు రూ. 6 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. టెమెరారియో అనేది లంబోర్గిని పాపులర్‌ Huracan సిరీస్‌కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్. 

గరిష్ట వేగం ఎంత? ఈ సూపర్ కారులో 4-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ ఉంది, ఇది 800 bhp పవర్‌ను & 730 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీతో, ఇది 920 hp పవర్‌ను & 800 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కారు గరిష్ట వేగం గంటకు 342 కిలోమీటర్లు. 

మొదటిసారి డ్రిఫ్ట్ మోడ్మొదటిసారిగా, హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు డ్రిఫ్ట్ మోడ్ ఫీచర్‌ను లంబోర్గిని టెమెరారియోతో తీసుకొచ్చారు. డ్రైవర్లు కార్‌ మీద సంపూర్ణ నియంత్రణతో స్టైలిష్ స్లయిడ్స్‌ చేసేందుకు డ్రిఫ్ట్ మోడ్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ లంబోర్గిని కారులో 13 డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి, వీటిలో నాలుగు స్టాండర్డ్‌ డ్రైవ్ మోడ్స్‌ ఉన్నాయి - మొదటిది సిట్టా, ఇది ఎలక్ట్రిక్ మోడ్ మాత్రమే. రెండోది స్ట్రాడా, ఇది డైలీ డ్రైవ్ కోసం. మూడోది స్పోర్ట్, ఇది హై స్పీడ్ కోసం. నాలుగోది కోర్సా, ఇది రేస్ ట్రాక్ కోసం. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే - ముందు భాగంలో 410mm డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో 390mm డిస్క్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు. ఇవి కారును కేవలం 32 మీటర్లలోనే 100 కిలోమీటర్ల వేగం నుంచి 0 కిలోమీటర్ల వేగానికి తీసుకురాగలవు.

స్టైలిష్ & లైట్‌ వెయిట్‌ డిజైన్టెమెరారియో డిజైన్ చాలా స్టైలిష్‌గా & లైట్‌ వెయిట్‌తో ఉంటుంది. ఈ మోడల్‌ను పూర్తిగా అల్యూమినియం ఫ్రేమ్‌తో డిజైన్‌ చేశారు, దీని బరువు కేవలం 1,715 కిలోలు మాత్రమే. అల్లెగ్గెరిటా ప్యాకేజీతో ఈ బరువు 1,690 కిలోలకు తగ్గుతుంది. కార్బన్ ఫైబర్ రియర్ వింగ్, స్పెషల్‌ అల్లాయ్ వీల్స్ & కొత్త బంపర్‌ను ఈ అప్‌డేటెడ్‌ మోడల్‌లో అందిస్తున్నారు. Huracan & Gallardo స్ఫూర్తితో దీనిని డిజైన్‌ చేశారు.

టెక్నాలజీ & ఫీచర్లుకారు క్యాబిన్‌ ఫైటర్ జెట్ (యుద్ధ విమానం) లాగా కనిపిస్తుంది. ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 8.4-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ & 9.1-అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే అందించారు.  హీటింగ్‌ & వెంటిలేషన్‌తో 18-వే పవర్ అడ్జస్టబుల్ సీట్స్‌ ఏర్పాటు చేశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్, ఆన్‌బోర్డ్ టెలిమెట్రీ & డాష్‌క్యామ్ కూడా ఉన్నాయి. 6.5 అడుగుల ఎత్తున్న డ్రైవర్ కూడా ఇందులో హాయిగా కూర్చోవచ్చు. షార్క్-నోస్ ఫ్రంట్ ఫాసియా, లోయర్ లిప్ స్పాయిలర్, ఫిజికల్ బటన్లతో మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ దీని ప్రత్యేకతలు.

ఫెరారీ & మెక్‌లారెన్‌తో పోటీభారతదేశ మార్కెట్‌లో, ఈ సూపర్ కారు Ferrari 296 GTB & McLaren Artura కు కాంపిటీషన్‌ ఇస్తుంది.