Xiaomi 13 Ultra ఇటీవలే చైనాలో ఆవిష్కరించబడింది. ఈ సరికొత్త అల్ట్రా ఫ్లాగ్‌షిప్ హ్యాండ్ సెట్ త్వరలో గ్లోబల్ మార్కెట్ లో విడుదల కానుంది. ఈ సూపర్-ప్రీమియం ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో ముందుగా తెలుసుకుందాం.
అదిరిపోయే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
తాజాగా విడుదలైన Xiaomi 13 అల్ట్రాకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే, Xiaomi 13 అల్ట్రా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCని కలిగి ఉంది. 12/16 GB RAM, 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల అతిపెద్ద AMOLED LTPO డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్ కు సపోర్టు చేయనుంది. డిస్‌ప్లే ముందు కెమెరాను కప్పి ఉంచే హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ లైకా బ్రాండెడ్ లెన్స్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఫోకల్ లెంగ్త్ పరిధిలో పెద్ద ఎపర్చరు, కాంపాక్ట్ సైజ్, అధిక ఇమేజింగ్ పనితీరుతో లెన్స్ సిస్టమ్ కలిగి ఉంది. 13S అల్ట్రాలోని అల్ట్రా వైడ్, టెలిఫోటో కూడా అద్భుతమైన ఆప్టిక్స్ సామర్థ్యాలతో వచ్చింది. Xiaomi 13 Ultra USB 3.x కనెక్టివిటీ పోర్ట్ తో అందుబాటులోకి వచ్చింది. Xiaomi స్మార్ట్ ఫోన్‌ల లో సాధారణ USB 2.0 తొలగించిన తొలి Xiaomi స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.
‘రియల్ కెమెరా’ దెబ్బకు వణుకుతున్న శామ్‌సంగ్, యాపిల్!
ఈ స్మార్ట్ ఫోన్ లోని రియల్ కెమెరా ఆపిల్, సామ్ సంగ్ లాంటి కంపెనీలకు వణుకు పుట్టిస్తోంది. జర్మన్ కెమెరా-మేకర్ లైకాతో Xiaomi ఈ కెమెరాను రూపొందింది. Xiaomi 13 అల్ట్రా నాలుగు బ్యాక్ కెమెరాల సెటప్ ను కలిగి ఉంది. ఆపిల్, సామ్ సంగ్ తో పోల్చితే, Xiaomi 13 అల్ట్రా కొత్త ప్రో మోడ్ తో సాధారణ వ్యక్తులు కూడా ప్రొఫెషనల్స్ మాదిరిగా ఫోటోలు తీసే అవకాశం ఉంటుంది. ఫోటోగ్రఫీకి సంబంధించి విభిన్న శైలులను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ తో ఆపిల్ ఇలాంటిదే చేసింది. అయితే, Apple ఫిల్టర్‌లు కాకుండా, Xiaomi ఫోన్ హైలైట్, షాడో, బ్రైటెస్, ఎక్స్‌పోజర్, కలర్, షార్ప్ నెస్, ఫోకస్, ఎపర్చరు, ISO, షట్టర్ స్పీడ్ సహా పలు సమగ్రమైన నియంత్రణలను అందిస్తుంది. ఈ స్థాయి నియంత్రణ సగటు వినియోగదారుడికి ఎక్కువగా అనిపించినప్పటికీ, Xiaomi దీన్ని అనుకున్నదానికంటే చాలా సులభతరం చేస్తోంది. Xiaomi 13 Ultra వీడియో నాణ్యత కేవలం ఒక సంవత్సరం క్రితం Xiaomi 12S Ultra అందించిన దానికంటే ఎక్కువగా ఉంది. రియల్ కెమెరా విషయంలో Xiaomiతో పోల్చితే ఆపిల్, శామ్ సంగ్ వెనుకబడే ఉన్నట్లు చెప్పుకోవచ్చు.