చైనీస్ స్మార్ట్‌ ఫోన్ల తయారీ దిగ్గజం Vivo, చైనాలో  'Y' సిరీస్ హ్యాండ్‌ సెట్ - Vivo Y78+ 5Gని లాంచ్ చేస్తున్నట్లు  ప్రకటించింది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇది 'Y' కేటలాగ్‌లో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న మొదటి హ్యాండ్‌ సెట్ గా గుర్తింపు పొందింది.


Vivo Y78+ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు


Vivo Y78+ అదిరిపోయే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 6.78-అంగుళాల 120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ ప్లే తో 2400 x1080 స్క్రీన్ రిజల్యూషన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 16.7 మిలియన్ల వరకు కలర్స్ ను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది.  హ్యాండ్‌సెట్ బరువు 177 గ్రాములు కాగా, 7.89 మిమీ మందంలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఆధారంగా పని చేసే ఆక్టా-కోర్ స్నాప్‌ డ్రాగన్ 695 5G చిప్‌ సెట్‌ ను కలిగి ఉంటుంది. ఇందులో అడ్రినో 619 GPU ఉంది.  ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియేషన్స్ లో వస్తుంది. ఒకటి 8GB/128GB  కాగా, మరొకటి 12GB /256GBగా ఉంటుంది. Y78+ Android 13 ఆధారంగా OriginOS 3పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌ 44W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్ చేసే  5000mAh బ్యాటరీని కలిగి ఉంది.


ఆప్టిక్స్ విషయానికి వస్తే, 2MP సెకండరీ లెన్స్‌తో 50MP OIS ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు భాగంలో, 8MP సెల్ఫీ షూటర్ ఉంది. కెమెరా UIలోని మోడ్‌లలో నైట్, పోర్ట్రెయిట్, డ్యూయల్ వ్యూ, పనోరమా, టైమ్-లాప్స్, డైనమిక్ ఫోటో సహా పలు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే  Wi-Fi, బ్లూటూత్ 5.1, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ ను కలిగి ఉంటుంది.


Vivo Y78+ ధర ఎంతంటే?


ఈ హ్యాండ్‌సెట్ చైనాలో మూడు వేరియంట్‌లలో విడుదల చేయబడింది. ఆయా వేరియెంట్ ను బట్టి ధరను ఫిక్స్ చేశారు.


1.8GB + 128GB - 1599 యువాన్ (దాదాపు రూ. 19,000)


2.8GB + 256GB - 1799 యువాన్ (సుమారు రూ. 21,500)


3.12GB + 256GB - 1999 యువాన్ (దాదాపు రూ. 23,800)


ఇక ఈ స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అజూర్, వార్మ్ సన్ గోల్డ్,  మూన్ షాడో అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ  హ్యాండ్‌ సెట్ ఏప్రిల్ 26 నుంచి చైనాలో అమ్మకానికి వస్తుంది.


భారత్ లో విడుదల ఎప్పుడంటే?


ప్రస్తుతానికి, ఈ హ్యాండ్‌ సెట్‌ను భారత్ లో ఎప్పుడు లాంచ్ చేస్తుందో కంపెనీ వెల్లడించలేదు.  అయితే, 'Y' సిరీస్‌కు ఉన్న మంచి  ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, Vivo దీన్ని త్వరలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. కాగా,  Vivo భారతదేశంలో X90 సిరీస్‌ను ఏప్రిల్ 26న ప్రకటించనుంది.






Read Also: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!