చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడంలో ముందుంటుంది. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లతో  స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుంది. తాజాగా వీవో కంపెనీ మరో స్మార్ట్ ఫోన్  సిరీస్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నెలలోనే Vivo X90 Pro పేరుతో భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 26 న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫక్షన్ విడుదల కానున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధర వివరాలు బయటకు వెల్లడికాలేదు.

Vivo X90 స్పెసిఫికేషన్లు

Vivo X90 అతి పెద్ద డిస్ ప్లేను కలిగి ఉండనుంది. 6.78-అంగుళాల AMOLED డిస్‌ ప్లే ఈ స్మార్ట్ ఫోన్ కు అమర్చబడి ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కట్ అవుట్, HDR10+, టచ్ శాంప్లింగ్ రేట్ 300 Hz,  2,800 x 1,260 పిక్సెల్స్  రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.  Vivo X90 Proలో 6.78-అంగుళాల AMOLED డిస్ ప్లే 2K రిజల్యూషన్‌ను అందిస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 PPI, 2160Hz PWM, HDR10+ ఉంటుంది.  Immartalis-G715 ప్రాసెసర్‌ తో జత చేయబడిన MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌ సెట్ Vivo X90,  Vivo X90 Proకి శక్తినిస్తుంది. Vivo X90 సిరీస్‌లో 512GB UFS 4.0 స్టోరేజ్, 12G B వరకు LPDDR5 RAM ఉంది.

అదిరిపోయే కెమెరాలు

Vivo X90 వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి.  f/2.0 అపర్చర్‌ తో 12MP పోర్ట్రెయిట్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్, f/1.75 ఎపర్చరు, OIS, EIS, LED ఫ్లాష్‌తో కూడిన 50MP IMX866 మెయిన్ సెన్సార్ ఉంటుంది.  f/2.0 ఎపర్చరుతో 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీలు,  వీడియో కాల్‌ల కోసం, ముందు భాగంలో f/2.45 ఎపర్చర్‌తో 32MP కెమెరా ఉంది.

Bags are packed and @gogiinc is all set for another adventure with his all-new vivo X90 Series.
Join him on his journey and stay tuned to witness the Xtreme. https://t.co/mB8DhFT0Pu
— vivo India (@Vivo_India) April 17, 2023

అతి పెద్ద బ్యాటరీ

Vivo X90 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,810mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. Vivo X90 Proలో 4,870mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Read Also: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..