షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ ఫోన్‌కు ఎంఐయూఐ 12.5 ఎన్‌హేన్స్‌డ్ ఎడిషన్ అప్‌డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వినియోగదారులు ట్వీటర్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. కేవలం మనదేశంలో మాత్రమే కాకుండా టర్కీలో కూడా వినియోగదారులకు ఈ అప్‌డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.


భారతదేశంలో వినియోగదారులకు V12.5.4.0.RKOINXM వెర్షన్ నంబర్, టర్కీ వినియోగదారులకు V12.5.4.0.RKOTRXM వెర్షన్ నంబర్‌తో ఈ కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించారు.


మనదేశంలో ఈ అప్‌డేట్ సైజు 479 ఎంబీగా ఉంది. చేంజ్ లాగ్ ప్రకారం చూసుకుంటే.. ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగనుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా మెరుగవనుంది. సిస్టం రీసోర్సెస్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటూ స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఫోకస్డ్ అల్‌గారిథంను ఇందులో అందించనున్నారు.


మెరుగైన మెమొరీ మేనేజ్‌మెంట్ మెకానిజం కూడా దీని ద్వారా అందించనున్నారు. కొత్త లిక్విడ్ స్టోరేజ్ మెకానిజంల ద్వారా పోయే కొద్దీ సిస్టం కూడా మెరుగ్గా స్పందిస్తూ ఉంటుంది. ఈ అప్‌డేట్‌ను థర్డ్ పార్టీ లింకుల ద్వారా చేసుకోవద్దని.. మీ ఫోన్‌కు వచ్చినప్పుడు సెట్టింగ్స్ నుంచి మాత్రమే చేసుకోవాలని షియోమీ తెలిపింది.


ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.26,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది. అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10-బిట్ ఫ్లాట్ ట్రూ కలర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 


8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4250 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. 5జీ, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా షియోమీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందించింది.


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి