X New Monetization Policy: ఎలాన్ మస్క్ యజమాని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్/ట్విట్టర్ దాని క్రియేటర్స్ కోసం మానిటైజేషన్ విధానాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత వినియోగదారులు ఇప్పుడు యాడ్స్‌పై ఆధారపడటం తగ్గుతుంది. నిజానికి ఇంతకుముందు క్రియేటర్లు తమ పోస్ట్‌ల్లో చూపిన ప్రకటనల నుంచి వచ్చే రెవిన్యూలో షేర్‌ను పొందేవారు. కానీ ఇప్పుడు కంపెనీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కంటెంట్ క్రియేటర్లకు లభించే పేమెంట్లు ఎక్స్ ప్రీమియం యూజర్ల వారి కంటెంట్‌పై ఇచ్చే రియాక్షన్ల ఆధారంగా ఉండనుంది.
ఎక్స్ పాలసీలో మార్పు...
అడ్వర్టైజర్ల నుంచి ఎక్స్‌కు ఇబ్బందులు రావడం ప్రారంభం అయింది. ఇందులో గ్రూప్‌పై చట్టపరమైన చర్యలు కూడా ఉన్నాయి. ఈ గ్రూప్ ఏకంగా ప్లాట్‌ఫాంనే బాయ్‌కాట్ చేసింది. దీంతో క్రియేటర్‌లు ఇప్పుడు ఎక్కువ ఎంగేజ్‌మెంటే పొందే పోస్ట్‌ల ఆధారంగా చెల్లింపులు పొందుతారని దీని అర్థం.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
అయితే క్రియేటర్‌కు లభించే పేమెంట్ పర్సంటేజీ మారుతుందా లేదా అనే విషయాన్ని ఎక్స్ స్పష్టం చేయలేదు. కానీ పోస్ట్‌లపై ఎంగేజ్‌మెంట్ పెరగడం వల్ల పేమెంట్స్ పెరుగుతాయని నమ్ముతారు. తద్వారా యూజర్లు యాడ్లపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు క్రియేటర్లు మునుపటి కంటే ఎక్కువ సంపాదించగలరు. దీని కోసం వారు కష్టపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఈ మానిటైజేషన్ పాలసీలో మరిన్ని మార్పులు చూసే అవకాశం కూడా ఉంది.
ఎక్స్ అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త విధానం తమ రెవిన్యూ షేర్‌లో తగ్గింపు గురించి కంప్లయింట్ చేసిన క్రియేటర్లలో ఉండే ఆందోళనలను తగ్గించగలదు. ఇది కాకుండా ప్రీమియం సబ్‌స్క్రైబర్లు తక్కువ యాడ్‌లను చూడగలరు. అలాగే ప్రీమియం ప్లస్ టైర్‌లో ఎలాంటి ప్రకటనలు లేవు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?