X Down Latest News: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X సోమవారం పదే పదే డౌన్ అయింది. కోట్లలో వినియోగదారులు తమ పోస్టులను యాక్సెస్ చేయలేకపోయారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మొదటిసారిగా డౌన్ అయింది. కాసేపటికే సెట్ అయింది. సాయంత్రం 7:20 గంటలకు మరోసారి అదే పరిస్థితి ఎదుర్కొన్నారు వినియోగదారులు. దీని తరువాత, రాత్రి 9:30 గంటల నుంచి చాలా సేపు X లో పోస్టులు కనిపించలేదు. 


అవుటేజ్ మానిటరింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, భారతదేశం నుంచి దాదాపు 2,000 ఫిర్యాదులు, US నుంచి 18,000, UK నుంచి 10,000కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. USలో 57% మంది వినియోగదారులు యాప్ సమస్యలను, 34% మంది వెబ్‌సైట్ సమస్యలను, 9% మంది సర్వర్ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు. UKలో 61% మంది వినియోగదారులు యాప్‌తో సమస్యలు ఎదుర్కొన్నారు. 34% మంది వెబ్‌సైట్‌తో, 5% మంది సర్వర్‌తో ఇబ్బంది పడ్డారు.  






వినియోగదారులు X యాప్‌ ఓపెన్ చేసినప్పుడు "ఏదో తప్పు జరిగింది, దయచేసి రీలోడ్ చేయండి" అనే సందేశాన్ని చూపిస్తోంది. ఇలా చూపించిన కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ యాక్సెస్ అవుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ప్లాట్‌ఫామ్ సేవలు రాత్రి 10 గంటలకు (IST) పునరుద్ధరించారు. వినియోగదారులు వెబ్‌సైట్, యాప్‌ను మళ్లీ యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతోంది. ఈ అంతరాయం ప్రభావం ముఖ్యంగా భారతదేశంలో కనిపించింది. 


ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే 
ఎలోన్ మస్క్ స్పందిస్తూ 'X పై సైబర్ దాడి జరిగింది. ప్రతిరోజూ X పై సైబర్ దాడులు జరుగుతున్నాయి. కానీ ఈసారి X ను గట్టిగానే లక్ష్యంగా చేసుకున్నారు. ఇది ఏదో ప్రమాదకరమైన సమూహం చేసిన పని లేదా ఇందులో ఏదో దేశం కూడా పాలుపంచుకుంది. అని అనుమానం వ్యక్తంచేశారు. 



భారతదేశంలో అంతరాయం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, 3 వేల వరకు ఫిర్యాదులు ఇప్పటికీ నమోదయ్యాయి. 80% మంది వినియోగదారులు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు, 11% మంది లాగిన్ అవ్వడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 9% మంది మొబైల్ యాప్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు.


మధ్యాహ్నం ట్విట్టర్ పనిచేయకపోవడంతో, వేలాది మంది వినియోగదారులు దాన్ని యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడ్డారు. చాలా మంది వినియోగదారులు X లోనే తమ నిరాశన వ్యక్తం చేశారు. చాలా మంది వినియోగదారులు ఈ అంతరాయం గురించి X లోని పోస్ట్‌ల ద్వారా తెలియజేశారు. దాని ప్రభావం భారతదేశంలో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతానికి ట్విట్టర్ పూర్తిగా పునరుద్దరించారు. కానీ దీని వెనుక ఉన్న కారణం ఇంకా వెల్లడి కాలేదు.