World Password Day : టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది తమ ఉత్పత్తుల్లో పాస్‌వర్డ్ లేని FIDO సైన్-ఇన్ ప్రమాణాలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రపంచ పాస్‌వర్డ్ దినోత్సవం సందర్భంగా ప్రకటించాయి. యాపిల్, గూగుల్ , మైక్రోసాఫ్ట్ ప్రత్యామ్నాయ సైన్-ఇన్ పద్ధతులను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ మూడు సాంకేతిక దిగ్గజాలు పాస్‌వర్డ్‌లు లేని భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాయి. FIDO అలెయన్స్, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం రూపొందించిన పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ప్రమాణాలకు మద్దతు ఇచ్చేందుకు ఈ మూడు కంపెనీలు ఇవాళ ప్రకటనలు చేశాయి.
పాస్ వర్డ్ లేని సైన్ ఇన్
ఈ మూడు టెక్ దిగ్గజాలు ఇప్పటికే పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ఎంపికలకు మద్దతు ఇస్తున్నాయి. అయితే సాధారణంగా వినియోగదారులు పాస్‌వర్డ్ లేని విధానాలను ఉపయోగించే ముందు ప్రతి వెబ్‌సైట్ లేదా యాప్‌కి వారి పరికరంతో సైన్-ఇన్ చేయాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరంలో ప్రతి ఖాతాతో సైన్-ఇన్ చేయకుండానే వారి FIDO సైన్-ఇన్ ఆధారాలను ఆటోమేటిక్‌గా యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించాలని టెక్ దిగ్గజాలు ప్లాన్ చేస్తున్నాయి. OS ప్లాట్‌ఫారమ్ లేదా బ్రౌజర్‌తో సంబంధం లేకుండా సమీపంలోని పరికరంలో యాప్ లేదా వెబ్‌సైట్‌కి సైన్-ఇన్ చేయడానికి FIDO మొబైల్ పరికరాలను ఉపయోగించడానికి అనుమతించాలని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.
భద్రతా సమస్యలకు పాస్ వర్డ్ కారణం
ఈ కీలక టెక్ సంస్కరణకు పొటెక్షన్ పెంచడానికి పాత పాస్‌వర్డ్ ఆధారిత ప్రమాణాలను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గూగుల్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మార్క్ రిషర్ చెప్పారు. "Google కోసం పాస్‌వర్డ్ లేని భవిష్యత్తు కోసం నిరంతరంగా పనిచేస్తున్నాం" అని రిషర్ అన్నారు. వెబ్‌లో అతిపెద్ద భద్రతా సమస్యలలో పాస్‌వర్డ్‌లు ఒకటని FIDO తెలిపింది. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఒకే పాస్‌వర్డ్‌ను బహుళ సేవల్లో మళ్లీ ఉపయోగిస్తారు. ఇది డేటా ఉల్లంఘనలకు ఖాతా హాకింగ్ కు దారితీయవచ్చు.
ఎన్ని ఆవిష్కరణలు చేసినా పాస్ వర్డ్ లు ఉన్నాయి
వినియోగదారుల వేలిముద్ర లేదా పిన్ లను డివైస్ అన్‌లాక్ చేయడానికి, సైన్ ఇన్ చేసుకోడానికి ఉపయోగపడతాయి ఈ టెక్ దిగ్గజాలు తెలిపాయి. పాస్‌వర్డ్‌లు లేదా ఇమెయిల్ లేదా టెక్స్ట్ ద్వారా పంపించే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు “లెగసీ మల్టీ ఫ్యాక్టర్ టెక్నాలజీల” కన్నా మరింత సురక్షితమైందని FIDO తెలిపింది. "ఉత్పత్తులలో వినియోగదారుల స్నేహపూర్వక ఆవిష్కరణకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడినందుకు Apple, Google, Microsoftలను అభినందిస్తున్నాం" అని FIDO అలయన్స్ సీఎంఓ ఆండ్రూ షికియార్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ కీపర్ సెక్యూరిటీ సహ వ్యవస్థాపకుడు క్రెయిగ్ లూరీ గత సంవత్సరం SiliconRepublic.comతో మాట్లాడుతూ " ఎంత ఆవిష్కరణ చేసినా, పాస్‌వర్డ్‌లు ఇక్కడే ఉంటాయి" అని అన్నారు. క్లౌడ్ ఆధారిత విధానాల వైపు ప్రపంచం పరివర్తన చెందడంతో పాస్‌వర్డ్ వినియోగం విపరీతంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.