తన ఫ్యాషన్ స్టైల్ తో వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఫేమ్ తెచ్చుకోవాలని చూస్తున్న ఈ బ్యూటీ తన అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరిస్తుంటుంది. ఆమె వేసుకునే బట్టలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంత విడ్డూరంగా ఉంటాయి మరి. తనకు మాత్రమే నచ్చే ఈ స్టైల్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది ఆమెని ట్రోల్ చేస్తుంటారు.
అయినప్పటికీ ఉర్ఫీ మాత్రం తన డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో అందాల ప్రదర్శన ఆపడం లేదు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తనలా పలుచటి బట్టలు వేసుకునే వారిని పొగుడుతూ.. తనను మాత్రం ఎందుకు తిడుతున్నారని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించింది. సమంత ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకున్న ఫొటోలను షేర్ చేసిన ఓ వెబ్ సైట్ దానికి పాజిటివ్ టైటిల్ ఇచ్చింది.
ఉర్ఫీ వేసుకున్నట్రాన్స్పరెంట్ డ్రెస్ ను మాత్రం దోమల జాలితో పోలుస్తూ చెత్తగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఈ రెండు న్యూస్ లకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను జోడించి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది ఉర్ఫీ. 'నేనేం చెప్పాలనుకున్నానో.. మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. సమంత అంటే నాకు కూడా ఇష్టమే. నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్‌లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.