Wired vs Wireless Internet: ఈ రోజుల్లో ఇంటర్నెట్ కోసం ఫైబర్, కేబుల్, డీఎస్ఎల్, 4G, 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ వంటి అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏ కనెక్షన్‌ను తీసుకోవాలో అనే విషయంలో చాలా మందిలో ఓ గందరగోళం నెలకొంటుంది. మీ ఇంటికి వైర్డ్ ఇంటర్నెట్ మంచిదా లేక వైర్‌లెస్ ఇంటర్నెట్ సెట్ అవుతుందా? అనేది కేవలం ఇంటర్నెట్ స్పీడ్‌తో మాత్రమే కాకుండా, మీ ఏరియాలో అందుబాటులో ఉన్న సేవలు, నెట్‌వర్క్ క్వాలిటీ, మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
వైర్డ్ vs వైర్‌లెస్ ఇంటర్నెట్
సాధారణ వైర్డ్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఫైబర్, కోయాక్సియల్ కేబుల్ లేదా డీఎస్ఎల్ వంటి ఫిజికల్ లైన్ ద్వారా మీ ఇంటికి కనెక్షన్‌ను అందిస్తే దానిని 'వైర్డ్ ఇంటర్నెట్' అంటారు. మరోవైపు 'ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్' ఇంట్లోకి ఎలాంటి కేబుల్ రాదు. ఇంట్లో ఏర్పాటు చేసిన ఒక గేట్‌వే ద్వారా 4G LTE , 5G నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను రిసీవర్ నుంచి వై-ఫై లేదా ఈథర్‌నెట్ ద్వారా డివైజ్‌లకు ప్రసారం చేస్తుంది.
వైర్డ్ ఇంటర్నెట్ ప్రత్యేకతలు
మీ ఏరియాలో బెస్ట్ ఫైబర్ సర్వీస్ అందుబాటులో ఉంటే, వైర్డ్ ఇంటర్నెట్ అత్యంత వేగవంతమైన కనెక్షన్‌ను అందిస్తుంది. అయితే అన్ని వైర్డ్ కనెక్షన్లు వేగంగా ఉండవు. ఉదాహరణకు ఒక పాత DSL కనెక్షన్ మంచి 5G హోమ్ ఇంటర్నెట్ కంటే నెమ్మదిగా ఉండొచ్చు. 2026 ఓపెన్‌సిగ్నల్ విశ్లేషణ ప్రకారం, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ వినియోగదారులతో పోలిస్తే ఫైబర్, కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు అధిక డౌన్‌లోడ్ స్పీడ్ పొందుతున్నారు.
వైర్‌లెస్ ప్రయోజనాలు
ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ ప్లస్ పాయింట్ ఈజీ సెటప్. టెక్నీషియన్ కోసం వేచి ఉండాల్సిన పని లేకుండా, వినియోగదారులే స్వయంగా గేట్‌వేను ఇంట్లో సిగ్నల్ బాగా వచ్చే చోట ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే, సిగ్నల్ స్పీడ్, నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను బట్టి వేగంలో మార్పులు వస్తుంటాయి. Also Read: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
వై-ఫై నెమ్మదిగా ఉంటే
ఒక రూములో వై-ఫై సిగ్నల్ వీక్ గా ఉంటే, అది ఇంటర్నెట్ సమస్య కానక్కర్లేదు. ఇంట్లో వై-ఫై కవరేజ్ సరిగా లేకపోవడం కూడా కారణం కావచ్చు. అలాంటి సమయంలో 'మెష్ వై-ఫై సిస్టమ్' వాడటం ద్వారా కవరేజీని పెంచుకోవచ్చు. అలాగే, 5G హోమ్ ఇంటర్నెట్ వాడేటప్పుడు కూడా కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలను ఈథర్‌నెట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.Also Read: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
మీకు ఏది బెస్ట్
మీ దగ్గర్లో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో ముందుగా నిర్ధారించుకోండి. ఆ తర్వాత డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్, లేటెన్సీ, నెలవారీ ధర, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, డేటా లిమిట్స్ బేరీజు వేసుకోవాలి. మీ ఏరియాలో తక్కువ ధరలో హై స్పీడ్ ఫైబర్ లభిస్తే అదే బెస్ట్ ఆప్షన్. ఒకవేళ వైర్డ్ ఆప్షన్లు ఎక్కువ ఖరీదైనవిగా లేదా కష్టంగా ఉంటే, మంచి సిగ్నల్ ఇచ్చే 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ అద్భుతమైన ప్రత్యామ్నాయం.Also Read: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
