iPhone 3 Whats App Accout: మీ ఐఫోన్‌లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ నెంబర్లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకోసం వాట్సాప్ ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఐఫోన్ కస్టమర్ల కోసం 'మల్టీ-అకౌంట్' ఫీచర్‌ను మరింత విస్తరించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఇకపై ఐఫోన్ కస్టమర్లు ఒకే వాట్సాప్ యాప్‌లో మూడు వాట్సాప్ అకౌంట్‌లను ఉపయోగించుకునే వెసులుబాటును తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. 

Continues below advertisement

ఐఫోన్‌లో ఎన్ని వాట్సాప్

వాట్సాప్ తీసుకురానున్న మల్టీ అకౌంట్ సదుపాయం ద్వారా 2026లో ఒకే యాప్‌లో రెండు వాట్సాప్‌లను ఉపయోగించే వెసులుబాటు ఉంది. దీనివల్ల యూజర్లు ఫస్ట్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వకుండానే రెండో అకౌంట్‌ను యాడ్ చేసుకునే వీలు ఉంటుంది. మరో ఫోన్ వాడటం లేదా వాట్సాప్ బిజినెస్ యాప్‌పై ఆధారపడే అవసరం తగ్గింది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తూ.. ఒకే యాప్‌లో మూడు అకౌంట్ల వరకు యాడ్ చేసుకునే ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది.

ఈ ఫీచర్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?

పర్సనల్, వర్క్, బిజినెస్ అవసరాల కోసం వేర్వేరు మొబైల్ నెంబర్లు వాడేవారికి ఈ ఫీచర్ ఒక గేమ్‌చేంజర్ అని చెప్పవచ్చు. పర్సనల్ అకౌంట్ ఫ్యామిలీ, స్నేహితులతో చాటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ లేదా వర్క్ అకౌంట్, బిజినెస్ లేదా ప్రాజెక్ట్స్ అకౌంట్‌ను వ్యాపార లావాదేవీలు, ప్రత్యేక ప్రాజెక్ట్‌ల కోసం ఉపయోగించవచ్చు.  మూడు నెంబర్లు వాడడానికి ప్రస్తుతం రెండో ఫోన్ లేదా వాట్సాప్ బిజినెస్ ఉపయోగించాల్సి వస్తుండగా, ఈ కొత్త అప్‌డేట్‌తో ఈ ఇబ్బంది లేకుండా ఒకే యాప్‌తో పనులన్నీ పూర్తవుతాయి. Also Read: ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

Continues below advertisement

 ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

వాట్సాప్ సెట్టింగ్స్‌లోని అకౌంట్స్ జాబితా ద్వారా కొత్త నెంబర్‌ను ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడు వాట్సాప్ అకౌంట్లు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. ప్రతి అకౌంట్ దాని సొంత చాట్ హిస్టరీ, నోటిఫికేషన్‌లు, బ్యాకప్‌లు, ప్రైవసీ సెట్టింగ్స్ వేర్వేరుగా ఉంటాయి. అకౌంట్ స్విచ్ చేసేటప్పుడు ప్రొఫైల్ ఫోటో, పేరు, ఫోన్ నంబర్ కనిపిస్తాయి. అంతేకాకుండా, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌కు ప్రత్యేకమైన ఐకాన్ ఉంటుంది. దీనివల్ల వేరే నెంబర్ నుండి పొరపాటున సందేశాలు వెళ్లే అవకాశం ఉండదు.Also Read: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!