iPhone Voice Control: ఐఫోన్ వాయిస్ కంట్రోల్ అంటే మనకు మొదటగా గుర్తుకువచ్చే పేరు 'సిరి'. అయితే, సిరి సహాయం లేకుండానే కేవలం మాట్లాడటం ద్వారా ఫోన్ స్క్రీన్‌పై ఉన్న ప్రతి అంశాన్ని కంట్రోల్ చేసేందుకు అద్భుతమైన ఫీచర్ ఐఫోన్‌లో అందుబాటులో ఉంది. దీనినే 'వాయిస్ కంట్రోల్' అంటారు. ఈ ఫీచర్ అనేక సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Continues below advertisement

ఫోన్‌ టచ్ చేయకుండానే  

వాయిస్ కంట్రోల్‌ కేవలం ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వడం మాత్రమే కాదు. మీ వాయిస్‌తో స్క్రీన్‌పై టచ్ చేయడానికి, స్వైప్ చేయడానికి, డ్రాగ్ చేయడానికి, లాంగ్-ప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, "కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయి", "ఇన్‌స్టాగ్రామ్‌ను ట్యాప్ చేయి", "వాల్యూమ్ పెంచు" వంటి ఆదేశాలను ఇవ్వొచ్చు. అంతేకాకుండా, స్క్రీన్‌పై ఉన్న నెంబర్ల ఆధారంగా కూడా వాటిని ఎంచుకోవచ్చు. "నెంబర్లు చూపించు" అని చెప్పగానే స్క్రీన్‌లోని ఆ విభాగంలోని నెంబర్లు కనిపిస్తాయి.  

వాయిస్ కంట్రోల్‌ను ఎలా ఆన్ చేయాలి?

  • ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం
  • మీ ఐఫోన్‌లోని Settings లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత Accessibility సెలెక్ట్ చేయండి. 
  • అనంతరం Voice Control ఆప్షన్‌పై క్లిక్ చేసి, దానిని ఆన్ చేయాలి.
  • మొదటిసారి యూజ్ చేస్తున్నప్పుడు అవసరమైన భాషను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ అయినప్పుడు స్టేటస్ బార్‌లో బ్లూ కలర్ ఐకాన్ కనిపిస్తుంది. Also Read: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!

ప్రత్యేక ఫీచర్లు  

  1. యాపిల్ కస్టమ్ కమాండ్‌ల ఆప్షన్  కూడా కల్పించింది. కస్టమర్లు ఒక నిర్దిష్ట కమాండ్ ద్వారా అంటే కస్టమ్ గెశ్చర్, షార్ట్‌కట్, టెక్స్ట్ ఇన్సర్ట్ తో లింక్ చేసుకోవచ్చు. ఓవర్‌లే ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై సంఖ్యలు, పేర్లు లేదా గ్రిడ్‌లను డిస్ ప్లే చేయవచ్చు. 
  2. ఫేస్ ఐడీ ఉన్న ఐఫోన్‌లలో ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే, మీరు ఫోన్ వైపు చూసినప్పుడు వాయిస్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. మీ ఫేస్ పక్కకు తిప్పితే ఆటోమేటిక్‌గా స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది.
  3. వాయిస్ కంట్రోల్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. ప్రతి ఆదేశానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.
  4. చేతికి గాయాలైనప్పుడు, వంట చేసేటప్పుడు, లేదా ఇతర కారణాల వల్ల స్క్రీన్‌ను తాకలేనటువంటి సందర్భాల్లో ఈ వాయిస్ కంట్రోల్ ఫీచర్ ఒక గొప్ప అవకాశంగా పనిచేస్తుంది. 

Also Read: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!

Continues below advertisement