RBI Governor Sanjay Malhotra: భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక అక్రమాలు, మారుతున్న టెక్నాలజీపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మనీ లాండరింగ్ స్వరూపం మారుతోందని అందుకు తగ్గట్టు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇలాంటి ఆర్థిక నేరలకు అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడ్డారు. 


టెక్నాలజీని విరివిగా వాడుకోవాలి


మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నప్పుడే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆర్థిక నేరాల స్వరూపం మారుతోందని తెలిపారు. వాటిని నియంత్రించే వ్యవస్థలు కూడా అందకు తగ్గట్టుగా డెవలప్ కావాలని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి వాటి ద్వారా అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ నిరంతరం బలోపేతం చేయాలని సూచించారు. 


నేరస్తుల కంటే ముందే వాడుకోవాలి


ఒక ఈవెంట్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆర్‌బిఐ గవర్నర్... వ్యాపారాన్ని టెక్నాలజీ సులభతరం చేసిందన్నారు. అదే సమయంలో మనీ లాండరింగ్, అక్రమంగా డబ్బులు సంపాదించే పద్దలు కూడా అప్‌డేట్ అయినట్టు వివరించారు. ఈ కారణంగా రిస్క్ అసెస్‌మెంట్ మోడల్‌ను మెరుగుపరచడం అవసరం అవుతుందని తెలిపారు. ఆర్థిక ప్రపంచంలో మారుతున్న ధోరణులు, అభివృద్ధిని అర్థం చేసుకోవాలని బ్యాంకులకు ఆయన సూచించారు. అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీతో నేరస్తుల ప్రయోజనం పొందుతారని హెచ్చరించారు. వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండానే పాలసీ మేకర్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.






చట్టబద్ధంగా ప్రవర్తించే వాళ్లకు ఇబ్బంది రాకూడదు


సంజయ్ మల్హోత్రా ఇంకా ఏమన్నారంటే..."మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా మన ఆర్థిక వ్యవస్థలను సురక్షితంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో మనం తీసుకున్న చర్యలు అతిగా ఉండకూడదు. చట్టబద్ధమైన కార్యకలాపాలు, పెట్టుబడులకు ఆటంకం ఏర్పడకూడదు. ఇలాంటివి పాలసీ మేకర్సు దృష్టిలో పెట్టుకోవాలి." అని అన్నారు. 


అనుమానాస్పద లావాదేవీలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోగల రూల్స్‌ను చట్టాలను రూపకల్పన జరగాలన్నారు మల్హోత్ర. అందుబాటులో ఉన్న డేటా నాణ్యత మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. AI లేదా బ్లాక్‌చైన్ టెక్నాలజీ లేదా మెషిన్ లెర్నింగ్, రానున్న టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఉందని తెలిపారు. 


అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంలో సహాయపడుతుంది
సంజయ్ మల్హోత్రా ప్రకారం, "పెరుగుతున్న టెక్నాలజీ లావాదేవీలను తనిఖీ చేయడానికి, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించడంలో సహాయపడుతుంది, దీనివల్ల తప్పులు, వాటి వల్ల తప్పుడు వెసులుబాటులు, ప్రతికూల పరిస్థితులకు అడ్డుకట్టపడుతుంది." అని తెలిపారు. 


చట్టబట్టంగా చెల్లింపులు చేసేవాళ్లకు, వ్యాపారాలు చేసే వాళఅలకు అడ్డంకులు సృష్టించకూడదని ఆర్‌బిఐ గవర్నర్ బ్యాంకర్లకు సూచించారు. మల్హోత్రా, "నేరాలను నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నప్పుడు, మనం వినియోగదారుల హక్కులు, సౌకర్యాలను గుర్తుంచుకోవాలి"అని అన్నారు.