ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత, టాప్ మేనేజ్మెంట్ లో కీలక మార్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక పదవుల్లోని వ్యక్తులను తొలగించిన మస్క్, వారి స్థానంలో పలువురిని తాత్కాలికంగా నియమించారు. ట్విట్టర్‌కు కొత్త రూపాన్ని అందించడానికి తన సన్నిహిత వ్యాపార సహచరులతో పాటు విశ్వసనీయ లెఫ్టినెంట్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు మస్క్ ఇప్పటికే వెల్లడించారు. వెంచర్ క్యాపిటలిస్ట్ (VC) డేవిడ్ సాక్స్‌తో పాటు, ఇండో అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ సాకారం తీసుకుంటున్నాడు.
శ్రీరామ్ కృష్ణన్ ఎవరు?
తాజాగా కృష్ణన్ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. కొంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి మస్క్ కు తాత్కాలికంగా సాయం చేయబోతున్నట్లు వెల్లడించాడు. భారతీయ సంతతికి చెందిన VC కృష్ణన్ ఓ పెట్టుబడిదారు. ఇంతకు ముందు ట్విట్టర్ లో ప్రొడక్ట్ లీడర్‌గా పని చేసేవాడు. ఇప్పుడు, అతను A16z అని పిలువబడే సిలికాన్ వ్యాలీ పెట్టుబడి సంస్థ ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో భాగస్వామి. ఈ సంస్థ మస్క్ Twitter కొనుగోలుకు నిధులు సమకూర్చింది.
ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, కృష్ణన్, అతడి భార్య ఆర్తి రామమూర్తి ఇద్దరూ చెన్నైలో జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటంబానికి చెందిన వీరు.. 2003లో కలిశారు. అప్పటికే వీరిద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇండియాలోనే స్కూలింగ్, కాలేజీ ఎడ్యుకేషన్ ను పూర్తి చేశాడు కృష్ణన్. ఆ తర్వాత తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలోని SRM ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ (B Tech) పూర్తి చేశారు. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో లోని నోయ్ వ్యాలీలో నివసిస్తున్నారు. వీరికి రెండు సంవత్సరాల కుమార్తె ఉంది.
ట్విట్టర్‌లో శ్రీరామ్ కృష్ణన్ పాత్ర ఏంటి?
శ్రీరామ్ కృష్ణన్, ట్విట్టర్‌లో తన కొత్తరోల్ గురించి చెప్తూ, అక్టోబర్ 31న Twitter HQ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “ఇప్పుడు ఆ మాట ముగిసింది. నేను ఎలన్ మస్క్ ట్విట్టర్ కోసం మరికొంత మంది గొప్ప వ్యక్తులతో కలిసి సాయం చేస్తున్నాను. నేను ( a16z) ఇది చాలా ముఖ్యమైన కంపెనీ అని, ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపగలదని నమ్ముతున్నాను. ఎలన్ ఆ కలను సాకారం చేయగల వ్యక్తి” అని రాసుకొచ్చారు.
ప్రముఖ కంపెనీల్లో కీలక బాధ్యతలు
కృష్ణన్ బిట్స్ కి, హోపిన్ అండ్ పాలీవర్క్ బోర్డులలో కూడా పనిచేశారు. a16zలో చేరడానికి ముందు, అతను Twitter, Snap, Facebookలో కోర్ కంజ్యూమర్ ప్రొడక్ట్ టీమ్ లో పని చేశాడు. Snap డైరెక్ట్ రెస్పాన్స్ యాడ్స్ బిజినెస్, Facebook ఆడియన్స్ నెట్‌వర్క్ ను లీడ్ చేశాడు. మైక్రోసాఫ్ట్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన కృష్ణన్, Windows Azure కోసం వివిధ APIలు/సేవలపై పనిచేశారు.ఈ, భారతీయ ఇంజనీర్ జనవరి 2021లో ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో భాగమయ్యారు. VC సంస్థ సామాజిక ఆడియో అప్లికేషన్ అయిన క్లబ్‌హౌస్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్నారు. కృష్ణన్ ఆర్తీ క్లబ్‌హౌస్ లో "గుడ్ టైమ్ షో" అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అక్కడే మస్క్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ తో పరిచయం ఏర్పడింది.
Read Also: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?