ట్విట్టర్ పిట్టను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్, వెను వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తో సహా కీలక పదవుల్లో కొనసాగుతున్న వాళ్లకు ఉద్వాసన పలికారు. ట్విట్టర్ లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, 2012 నుంచి ట్విట్టర్‌ న్యాయవాదిగా కొనసాగుతున్నన సీన్ ఎడ్జెట్ ను పదవుల నుంచి తప్పించారు. అనంతం 'ది బర్డ్ ఈజ్ ఫ్రీడ్’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. 


పరాగ్ అగర్వాల్ కు ఎంత చెల్లించాలంటే?


ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దానికంటే కొద్ది రోజుల ముందు పరాగ్, మస్క్ మధ్య  ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలాయి. మస్క్ ట్విట్టర్ కొనుగోలు అంశాన్ని తెరమీదకు తీసుకురాగానే, పరాగ్ బయటకు వెళ్లక తప్పదు అనే ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం అవి వాస్తవం అని తేలాయి. అయితే, కంపెనీ నుంచి పరాగ్ బయటకు వెళ్తున్న నేపథ్యంలో సుమారు $42 మిలియన్లు (ప్రస్తుత మారకపు విలువ ప్రకారం రూ.3,457,145,328) పొందుతారని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. Twitter ఇటీవలి ప్రాక్సీ స్టేట్‌మెంట్‌లోని నిబంధనల ప్రకారం ఒక్కో షేరు విలువ $54.20 ఆధారంగా అంచనా వేశారు.


పరాగ్ తో వివాదామే ట్విట్టర్ కొనుగోలుకు కారణం!


ట్విట్టర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న అగర్వాల్‌ను నవంబర్ 2021లో సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే CEOగా నియమించారు. ఐఐటీ బాంబే, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన అగర్వాల్, ట్విట్టర్ ఏర్పడిన వెంటనే జాయిన్ అయ్యాడు. వాస్తవానికి మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించగానే CEOగా నిష్క్రమణ ఖాయం అనిపించింది. తనకు ప్రస్తుత మేనేజ్మెంట్ మీద నమ్మకం లేదని ఏప్రిల్ 14న మస్క్ సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో చెప్పాడు. మేలో, కంపెనీ యూజర్ మెట్రిక్‌లను సమర్థించుకునేందుకు అగర్వాల్ పోస్ట్ చేసిన థ్రెడ్‌కు మస్క్ పూప్ ఎమోజితో రిప్లై ఇచ్చాడు. అంతేకాదు, ఇద్దరి మధ్య  ట్వీట్ వార్ కూడా నడిచింది. మస్క్, పరాగ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తాజాగా వీరి మధ్య జరిగిన అంతర్గత సంభాషణ వివరాలు బయటకు వచ్చాయి.






పరాగ్, మస్క్.. మధ్యలో డోర్సే!


వాస్తవానికి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు డోర్సే, మస్క్ చిరకాల మిత్రులు. మస్క్, పరాగ్ మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు  ప్రయత్నించాడు. ఇద్దరు కలిసి ఉంటే మంచిదని చెప్పుకొచ్చాడు. కానీ, అది సాధ్యం కాలేదు. చివరకు మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకోవడంతో పరాగ్ బయటకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడింది.


Read Also: మీ వాట్సాప్ డౌన్ అయ్యిందా? కంగారు పడొద్దు, ఈ 5 యాప్స్ వాడుకోండి