ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు  ఇండియాలో భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. 2019లో  400 మిలియన్ల మంది యూజర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 500 మిలియన్లకు చేరింది. ప్రపంచంలోనే భారత్ వాట్సాప్ కు అతిపెద్ద యూజర్ బేస్ గా కొనసాగుతుంది.  తాజాగా తన యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే సారి ఐదు ఫీచర్లను వినియోగదారుల ముందు ఉంచింది.  ఇటీవల,  గరిష్టంగా 30 మంది వ్యక్తులకు గ్రూప్ కాలింగ్‌ను అనుమతించింది. ఇప్పుడు ఆ లింక్‌ని ఉపయోగించి కాల్‌లో చేరడానికి వినియోగదారులను ఎనేబుల్ చేయడానికి గ్రూప్ కాలింగ్ లింక్‌ తో వస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ పలు అదనపు ఫీచర్లపై  పనిచేస్తోంది. ఇప్పుడు వాటిలో ఐదింటిని భారత వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.

  


1. అన్ రీడ్ ఫిల్టర్తో చాట్లను సార్ట్ చేసుకోవచ్చు


వాట్సాప్ లో మీరు చదవని మెసేజ్ లను సార్ట్ చేసుకునే అవకాశం ఉంది. తీరిగ్గా ఉన్నప్పుడు వాటిని చూసుకోవచ్చు.  iPhoneలో చదవని సందేశాలను వెతకడానికి చాట్ లిస్టును స్రోల్ చేయాలి. చూడని మెసేజ్ లకు అన్ రీడ్ ఫిల్టర్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. ఒక వేళ దాన్ని చదివిన వెంటనే ఆఫ్ చేయడానికి మళ్లీ అదే ఐకాన్ ను నొక్కాలి. ఆండ్రాయిడ్ యూజర్లు సెర్చ్ బార్‌ ను ట్యాప్ చేసి, చదవని వాటిని రీడ్ ఫిల్టర్ ఐకాన్ ను యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్‌ను ఆఫ్ చేయడానికి, X లేదంటే బ్యాక్‌ స్పేస్ ను నొక్కాలి.  వాట్సాప్ వెబ్ వినియోగదారులు సెర్చ్ బార్‌ కు కుడివైపున చదవని ఫిల్టర్ చిహ్నాన్ని క్లిక్ చేసుకునే అవకాశం ఉంటుంది.


2. అన్ డు డిలీట్ ఫర్ మీ


పొరపాటున  'డిలీట్ ఫర్ మి' ఫీచర్‌ని ఉపయోగించి ఏదైనా సందేశాన్ని తొలగించారని అనుకుందాం. ఆ సమయంలో  WhatsApp కొన్ని సెకన్ల పాటు నోటిఫికేషన్/స్నాక్‌ బార్‌ ను చూపిస్తుంది. మెసేజ్ డిలీట్ ఫర్ మీ.. అన్ డు అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది. కొన్ని సెకెన్ల పాటు ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది.  సందేశాన్ని పునరుద్ధరించడానికి వినియోగదారుడు ఆ వ్యవధిలో 'అన్‌ డు' పై నొక్కితే మళ్లీ మెసేజ్ కనిపిస్తుంది.


3. లింక్ ప్రివ్యూలు


వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉపయోగిస్తున్న వినియోగదారులు ఇతర వినియోగదారులు ద్వారా స్టేటస్ లో పోస్టు చేసిన లింక్/యూఆర్ఎల్ ప్రివ్యూ చూసే వెసులుబాటు కలుగుతోంది.  


4. గ్రూప్ నుంచి సీక్రెట్ గా వెళ్లిపోవడం


 ప్రస్తుతం వాట్సాప్  గ్రూప్ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఫీచర్‌ ని సవరించింది. ఇప్పుడు మీరు ఆయా గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయినప్పుడు గ్రూప్ అడ్మిన్/అడ్మిన్‌లకు మాత్రమే తెలుస్తుంది. ఇంతకు ముందు ఎవరైనా ఆ గ్రూప్ నుంచి  బయటకు వెళ్లినప్పుడు గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్ వచ్చేది.


5. అడ్మిన్- డిలీట్ ఫర్ ఎవ్రీ వన్


ప్రస్తుతం గ్రూపులో పెట్టే మెసేజ్ లు ఎవరికి వారు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరులు పెట్టిన మెసేజ్ ను వేరే సభ్యులు డిలీట్ చేసే అవకాశం లేదు. ఇకపై అడ్మిన్ లు గ్రూలో పెట్టిన ఎవరి మెసేజ్ అయినా డిలీట్ చేసే అవకాశం ఉంది.