Botsa Reaction On Harish :  ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లు అవమానాలు ఎదుర్కొంటున్నారని కానీ తెలంగాణలో టీచర్లకు మంచి ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవంగా చూసుకుంటున్నామని ..  ఉపాధ్యాయ సంఘ సమావేశంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో టీచర్ల సమస్యలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పీఆర్సీ అంశంపైనా.. తర్వాత సీపీఎస్ రద్దు అంశంపైనా టీచర్లు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది కానీ వారి డిమాండ్లను పరిష్కరించలేదు. అదే సమయంలో ఇటీవల మిలియన్ మార్చ్ చేపట్టాలని ప్రయత్నించడంతో పలువురిపై కేసులు పెట్టింది. అందుకే హరీష్ రావు టీచర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 


పీఆర్సీని పక్కపక్కన పెట్టి చూడాలని హరీష్‌కు బొత్స సలహా


హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో విశాఖలో మరో మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స స్పందించారు.  హరీష్ రావు అలా మాట్లాడకూడదని.. ఏమైనా సందేహాలు ఉంటే ఆయన ఏపీకి వచ్చి ఇక్కడి టీచర్లతో  మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. పీఆర్సీ విషయంలోనూ హరీష్ రావు చేసిన కామెంట్లను తప్పు పట్టారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని పక్క పక్కన పెట్టుకుని చూడాలన్నారు. అప్పుడే రెండు పీఆర్సీల్లో ఉన్న తేడాలు కనిపిస్తాయన్నారు. తెలంగాణ ఇచ్చిన పీఆర్సీ కంటే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుదని బొత్స చెబుతున్నారు.   అయితే తెలంగాణ తరహా పీఆర్సీ ఇవ్వాలని  ఉద్యమాలు చేసినప్పుడు ఉద్యోగులు డిమాండ్  చేశారు. 


ఎందుకొచ్చిన మాటలని బొత్స ఆగ్హహం


తెలంగాణ ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటున్నామని..త ఎందుకొచ్చిన మాటలు ఇవి అని బొత్స హరీష్ రావును ప్రశ్నంచారు. సాధారణంగా ఇలాంటి అంశాలపై విపక్షాలు ఎవరైనా విమర్శలు చేస్తే బొత్స సత్యనారాయణ ఫైరయిపోతారు. తీవ్రంగా విరుచుకుపడతారు. అయితే చేసింది పొరుగు రాష్ట్ర మంత్రి కాబట్టి బొత్స సత్యనారాయణ చాల పొలైట్‌గా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను  ప్రస్తావిస్తూ ఎదురు దాడి చేయలేదు. హరీష్ రావు చెప్పినట్లుగా ఉపాధ్యాయులను అగౌరవపర్చలేదని.. వారికి మంచి ప్యాకేజీ ఇచ్చామని వివరణ ఇవ్వడానికి బొత్స ఆసక్తి చూపించారు. ఒక వైపు టీఆర్ఎస్ మంత్రులు అలా విమర్శలు చేస్తూంటే.. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ నేతలు చాలా సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఈ రెస్పాన్స్ ద్వారానే వస్తున్నాయి. 


గతంలోనూ టీఆర్ఎస్ నేతల సెటైర్లు


గతంలో మంత్రి కేటీఆర్ ఏపీలో జీవనం నరకప్రాయమని చెప్పినప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు. అలాగే పోలవరం అంశంపైనా రెండు రాష్ట్రాల నేతల మధ్య వాదోవాదాలు.. విమర్శలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు టీచర్ల విషయానికి వచ్చే సరికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ .. ఎదురుదారి చేయకుండా.. వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు.


పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై అధ్యయనం జరగాల్సిందే - కేంద్రానికి స్పష్టం చేసిన ఏపీ పొరుగురాష్ట్రాలు!