హైసెన్స్ యూ7హెచ్ సిరీస్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 4కే డిస్‌ప్లేలు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఇందులో అందించారు. లోకల్ డిమ్మింగ్, క్వాంటం డాట్ కలర్స్‌ను ఇందులో ఎక్విప్ చేశారు.


హైసెన్స్ యూ7హెచ్ సిరీస్ టీవీ ధర
ఇందులో 55 అంగుళాల వేరియంట్ ధరను రూ.51,900 నిర్ణయించగా, 65 అంగుళాల వేరియంట్ ధర రూ.71,990గా ఉంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌తో ఈ టీవీ మార్కెట్లోకి వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త టీవీలపై మొత్తంగా మూడు సంవత్సరాల వారంటీని అందించనున్నారు.


హైసెన్స్ యూ7హెచ్ సిరీస్ టీవీ స్పెసిఫికేషన్లు
ఈ రెండు టీవీల్లోనూ క్యూఎల్ఈడీ 4కే డిస్‌ప్లేలను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా ఈ టీవీలో అందించారు. ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ ఫీచర్‌ను ఈ టీవీలో అందించారు. దీంతోపాటు డాట్ డిస్‌ప్లే టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


గేమ్ మోడ్ ప్రో, ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం, ఆటో లో లేటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ వంటి గేమింగ్ ఫీచర్లను అందించారు. వైఫై, బ్లూటూత్ వీ5.0, రెండు యూఎస్‌బీ పోర్టులు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు విత్ ఈఆర్క్ సపోర్ట్ కూడా ఈ టీవీల్లో ఉన్నాయి. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న 20W స్పీకర్లు ఇందులో ఉన్నాయి.


హైసెన్స్ ఇటీవలే మనదేశంలో 120 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 120 ఇంచుల 4కే లేజర్ స్క్రీన్‌ను అందించడం విశేషం. ఈ టీవీ ధరను రూ.4,99,999గా నిర్ణయించారు. ప్రపంచంలోనే ట్రిపుల్ కలర్ లేజర్ టెక్నాలజీతో లాంచ్ అయిన మొదటి టీవీ ఇదే అని హైసెన్స్ అంటోంది. ప్యూర్ రెడ్, గ్రీన్, బ్లూ లేజర్స్ ద్వారా కలర్ పెర్ఫార్మెన్స్ కొత్త స్థాయికి చేరుకోనుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఈ టీవీలో అందించారు.


హైసెన్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో టీవీలను విక్రయిస్తుంది. సౌతాఫ్రికా, స్లొవేనియా, సెర్బియా లాంటి దేశాల్లో కూడా హైసెన్స్‌కు మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలు ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 18 రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హబ్స్ కూడా హైసెన్స్‌కు ఉన్నాయి.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?