WhatsApp New Features: ఆండ్రాయిడ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, మీ కోసమే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్లు!

ఆండ్రాయిడ్ వినియోగదారులకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 ఫీచర్లను అందిస్తోంది.

Continues below advertisement

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వినియోగదారులు మరితం సులభంగా చాటింగ్ చేసుకునేలా ఈ ఫీచర్లను డెవలప్ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల అభిరుచికి తగినట్లు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈజీ చాట్స్, కాల్స్ తో  కొత్త లే అవుట్‌ ను రూపొందించింది. మెయిన్ పేజీ రూపాన్ని రిఫ్రెష్ చేసింది. కొత్త చాట్ లాక్ ఫీచర్, WearOS సపోర్ట్,  స్టేటస్ కోసం కొత్త టూల్స్‌ ను కూడా యాడ్ చేసింది.  

Continues below advertisement

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్లు

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. చాట్స్, కాల్స్ సహా మరిన్ని ట్యాబ్‌ల కోసం కంపెనీ కొత్త లేఅవుట్‌తో ప్రధాన పేజీ రూపాన్ని పూర్తిగా మార్చివేసింది.  అన్ని కొత్త ఫీచర్లు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ఇది వరుసగా  రోల్ అవుట్ అవుతున్నందున WhatsApp  ఆండ్రాయిడ్  వినియోగదారులందరికీ చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది.

మెయిన్ పేజీ లుక్ మార్చిన వాట్సాప్   

వాట్సాప్ పేజీ దిగువన చాట్స్, కాల్స్, కమ్యూనిటీలు, స్టేటస్ ట్యాబ్ లు కనిపిస్తాయి. ఇవన్నీ మీ ఫోన్‌లో  స్క్రీన్‌ మీద కనిపిస్తే, వినియోగదారులు ఆయా ట్యాబ్‌లను త్వరగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.  ఆండ్రాయిడ్‌లో డిసప్పియర్ కమ్యూనికేషన్‌  ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా, వినియోగదారులు ఇప్పుడు కీలకమైన టెక్స్ట్‌ లను తర్వాత చూసుకునేలా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం మెసేజ్ ను కీప్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇకపై వినియోగదారులకు వచ్చే GIFలు ఇప్పుడు ట్యాప్ అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ప్లే అయ్యేలా కొత్త ఫీచర్ ను రూపొందించింది వాట్సాప్. దీని ద్వారా నేరుగా GIFలను చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు చాట్ లాక్ ఫంక్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇతరులు ఎవరూ చూడకూడదనుకునే వారి ప్రైవేట్ మెసేజెస్ కు లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫింగర్ ఫ్రింట్ ద్వారా చాట్ లాక్ చేసుకోవచ్చు. WhatsApp స్టేటస్ కోసం నవీకరించబడిన ఫాంట్‌లు,  బ్యాగ్రౌండ్ కలర్స్ ను కూడా పొందే టూల్స్ ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ రీసెంట్ గా ఇతరులకు హైక్వాలిటీ ఫోటోలు పంపే అవకాశాన్ని పరిచయం చేసింది.  రీసెంట్ గా వాట్సాప్  WearOS స్మార్ట్‌ వాచ్‌లను యాడ్ చేసింది.  Fossil Gen 6, Galaxy Watch 5 Pro  లాంటి Wear OS వాచ్‌లను ఉపయోగించే వినియోగదారులు, ఇతరులు మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్  చేసే అవకాశం ఉంటుంది.

త్వరలో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి!

అటు వాట్సాప్, మరికొన్ని ఫీచర్ల కు సంబంధించి వర్క్ చేస్తోంది. వాట్సాప్ లోనే ఆఫీస్ మీటింగ్స్ నిర్వహించుకునేందుకు సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ చివరి దశ టెస్టింగ్ జరుపుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ 'స్క్రీన్ షేరింగ్' ఫీచర్‌ను విడుదల చేసింది.  ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్ట్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అంతేకాదు, త్వరలోనే ‘వాట్సాప్ యూజర్ నేమ్స్’ అనే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ దశలో ఉంది. ఇకపై ఫోన్ నెంబర్లు, కాకుండా యూజర్ నేమ్స్ సాయంతో చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!

Continues below advertisement
Sponsored Links by Taboola