సెల్ ఫోన్ వినియోగదారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సెల్ ఫోన్ పోగొట్టుకున్న వినియోగదారుల చెంతకు వాటిని సురక్షితంగా చేరవేర్చే లక్ష్యంతో CEIR అనే పోర్టల్ ను ప్రారంభించింది. తాజాగా మాల్వేర్ తో ఇబ్బంది పడే వినియోగదారుల కోసం సరికొత్త రిమూవల్ టూల్ అందుబాటులోకి తెచ్చింది.  ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ పేరుతో దీనిని వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. ఈ టూల్ సాయంతో సెల్ ఫోన్ లోని మాల్వేర్ ను స్కాన్ చేయడంతో పాటు తొలగించే అవకాశం ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ ఈ కొత్త టూల్ ను రూపొందించింది.


ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ పై అవగాహన కల్పిస్తున్న కేంద్రం


కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ గురించి వినియోగదారులలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. సెల్ ఫోన్ వినియోగదారులకు ఎస్సెమ్మెస్  ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. సైబర్ మోసాల నుంచి సురక్షితంగా ఉండాలని, ఆయా డివైజ్ లను రక్షించేందుకు భారత ప్రభుత్వం ద్వారా రూపొందించబడిన ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ టూల్ ద్వారా ఎవ్వరైనా తమ సెల్ ఫోన్ లోని మాల్వేర్ ను తీసివేసుకునే అవకాశం ఉంటుంది.    


వాస్తవానికి గత కొంత కాలంగా సైబర్ మోసాలు బాగా పెరిగాయి. ప్రమాదకరమైన మాల్వేర్స్ టార్గెట్ చేసుకున్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లలోకి మాల్వేర్స్ పంపించి వాటిని క్లిక్ చేయడానికి ఆయా డివైజెస్ లోని డేటా అంతటిని సైబర్ కేటుగాళ్లు తస్కరిస్తున్నారు. ముందుగా స్పామ్ మెసేజ్ పంపడం, వాటి గురించి సరిగా తెలియని వినియోగదారులు లింక్ క్లిక్ చేయగానే  ఫోన్ పూర్తిగా హ్యాకర్ల కంట్రోల్ లోకి వెళ్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ ద్వారా, వినియోగదారులు తమ సెల్ ఫోన్లలోని మాల్వేర్స్ ను గుర్తించడంతో పాటు తొలగించే అవకాశం ఉంటుంది. 


ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ ఎలా వాడాలంటే?



  1. ముందుగా  www.csk.gov.in/ అనే వెబ్ సైట్ ను క్లిక్ చేయాలి.

  2. అందులో ‘సెక్యూరిటీ టూల్స్’ పై క్లిక్ చేయాలి.

  3. బోట్ రిమూవల్ టూల్ యాంటీవైరస్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి.

  4. ‘డౌన్‌లోడ్’ బటన్‌పై క్లిక్  చేసి టూల్ డౌన్ లోడ్ చేయాలి.

  5. యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీ సెల్ ఫోన్ లో దానిని రన్ చేయాలి.

  6. యాప్ మీ డివైజ్‌లోని మాల్వేర్‌ను స్కాన్ చేస్తుంది.

  7. ఏవైనా మాల్వేర్స్ గుర్తిస్తే వాటిని తొలగిస్తుంది.  


ఈ టూల్ ను మోబైల్ తో పాటు ప్యూటర్లు, ట్యాబ్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. సేమ్ సెల్ ఫోన్ మాదిరిగానే ఆయా డివైజెస్ లో రన్ చేసి, మాల్వేర్స్ ను గుర్తించడంతో పాటు రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టూల్ అత్యంత సురక్షితమైనది కావడంతో పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ టూల్ ఎంతో సమర్థవంతంగా మాల్వేర్స్ ను ఎదుర్కొంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.


Read Also: ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?