వాట్సాప్ ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా చాలా కాలంగా వాయిస్, వీడియో కాల్‌లను అందిస్తోంది. అయితే ఈ ఫీచర్ వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ని ఉపయోగించి వాయిస్ లేదా వీడియో కాల్ చేసుకోవచ్చు. ఇది పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ ఓరియంటేషన్ రెండింటిలోనూ పని చేస్తుంది.


ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం వన్ టు వన్ కాల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్‌ను చేర్చే డెస్క్ టాప్ యాప్‌లో చేర్చే యోచనలో ఉన్నట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్‌లోని అన్ని వాయిస్, వీడియో కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటాయి. వాట్సాప్ డెస్క్‌టాప్‌ని ఉపయోగించి వాయిస్ లేదా వీడియో కాల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వాట్సాప్ డెస్క్‌టాప్‌లో వాయిస్ లేదా వీడియో కాల్ చేయడానికి మీ ల్యాప్‌టాప్‌లో ఏమేం ఉండాలి?


1. వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ (Windows PC, MacOS కోసం అందుబాటులో ఉంది)
2. ఆడియో, మైక్రోఫోన్ అవుట్‌పుట్ డివైస్
3. వీడియో కాల్స్ కోసం కెమెరా
4. మీ ఫోన్, కంప్యూటర్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ పని చేస్తూ ఉండాలి. కాల్‌ని చేయడానికి మీ ఫోన్ ఆన్‌లైన్‌లో ఉండాలి. కానీ కాల్ మాత్రం మీ ఫోన్ నుంచి వెళ్లదు.
5. మీ కంప్యూటర్ మైక్రోఫోన్, కెమెరాను యాక్సెస్ చేయడానికి వాట్సాప్ డెస్క్‌టాప్‌ యాప్‌కు పర్మిషన్ ఇవ్వాలి.
6. వాట్సాప్ డెస్క్‌టాప్ కాలింగ్‌కు మ్యాక్ఓఎస్ 10.13, Windows 10 64 బిట్ వెర్షన్ 1903 ఆ పైబడిన వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ ఉంది. మీరు బ్రౌజర్‌లో వాట్సాప్‌ వెబ్‌ను కాకుండా వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను ఉపయోగించాలి.


వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ ఉపయోగించి వాయిస్ కాల్ చేయడం ఎలా?


1. మీ కంప్యూటర్‌లో WhatsApp డెస్క్‌టాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
2. మీ ఫోన్‌ని ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. (మీ ఫోన్‌లో క్యూఆర్ కోడ్ ఓపెన్ అవ్వడం కోసం వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి లింక్డ్ డివైసెస్‌ను క్లిక్ చేయాలి.)
3. ఇప్పుడు వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో మీరు కాల్ చేయాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత చాట్‌ని తెరవండి.
4. అక్కడ వాయిస్ కాల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అంతే మీ కాల్ స్టార్ట్ అవుతుంది.
5. మీరు పూర్తి చేసిన తర్వాత ‘ఎండ్ కాల్’పై క్లిక్ చేయండి.


మీరు కాల్ సమయంలో మైక్రోఫోన్ సింబల్‌ను క్లిక్ చేయడం ద్వారా మీ మ్యూట్, అన్‌మ్యూట్ చేయవచ్చు.


వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ ద్వారా వీడియో కాల్ చేయడం ఎలా?


1. మీ కంప్యూటర్‌లో వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
2. మీ ఫోన్‌‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. (పైన పేర్కొన్న రెండో స్టెప్‌ను ఫాలో అవ్వండి.)
3. ప్పుడు వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో మీరు వీడియో కాల్ చేయాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత చాట్‌ని తెరవండి.
4. ఇప్పుడు వీడియో కాల్ సింబల్‌పై నొక్కండి. అనంతరం మీ కాల్ స్టార్ట్ అవుతుంది.
5. కాల్ కంప్లీట్ అయ్యాక ‘ఎండ్ కాల్‌’పై క్లిక్ చేయండి.


వాయిస్ కాలింగ్ తరహాలోనే మీరు కాల్ సమయంలో మైక్రోఫోన్ సింబల్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ మైక్‌ను మ్యూట్ చేయవచ్చు, అన్‌మ్యూట్ చేయవచ్చు. మీరు కాల్ సమయంలో కెమెరా సింబల్‌పై నొక్కడం ద్వారా మీ కెమెరాను కూడా ఆఫ్ చేయవచ్చు.







Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?