సాధారణంగా వాట్సాప్ మెసేజ్ లు చూడగానే బ్లూ టిక్ పడుతుంది. ఈ బ్లూ టిక్ ఆధారంగానే మెసేజ్ పంపిన వాళ్లు, తమ మెసేజ్ చదివారో? లేదో? తెలుసుకుంటారు. బ్లూ టిక్ కనిపిస్తే చదివినట్లు, కనిపించకపోతే చదవనట్లుగా భావిస్తారు. కొన్నిసార్లు మనం వాట్సాప్ మెసేజ్‌లను చదివినట్లు.. పంపిన వారికి తెలియకుండా ఉండాలి అనుకుంటాం. ఇందుకోసం ఏ థర్డ్ పార్టీ యాప్ లు వాడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోని కొన్ని సెట్టింగులను మార్చుకుంటే సరిపోతుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, iOS యూజర్లు అయినా జస్ట్ ఈ ట్రిక్ లను ఫాలో అయితే చాలు. ఎదుటి వారు పంపిన మెసేజ్ లను వారికి తెలియకుండా చదవవచ్చు. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు ఈజీ ట్రిక్స్ తో రీడ్ రిసీట్ లను నిలిపి వేయవచ్చు. లేదంటే ఆఫ్ లైన్ లో చూడ్డం ద్వారా వారికి బ్లూ టిక్ కనిపించకుండా చేయవచ్చు. ఇందుకోసం ఏ సెట్టింగ్స్ మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- ముందుగా మీ ఫోన్ లోవాట్సాప్ ఓపెన్ చేసి , స్క్రీన్ మీద కనిపించే మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. అకౌంట్ లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత ప్రైవసీలోకి వెళ్లండి. రీడ్ రీసీట్ ఫీచర్ ను ఆఫ్ చేయాలి. అంతే, అవతలి వారికి తెలియకుండా మెసేజ్ లను చూసుకోచ్చు.
WhatsApp మెసేజెస్ సీక్రెట్ గా చదవడానికి మరికొన్ని మార్గాలు
నోటిఫికేషన్ బార్ ద్వారా..
WhatsApp సందేశాలను రహస్యంగా చదవడానికి మరొక మార్గం.. నోటిఫికేషన్ బార్ ద్వారా మెసేజ్ లను చదవడం. మీకు వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే.. నోటిఫికేషన్ బార్‌ని కిందికి లాగాలి. అలా చేయడం మూలంగా మెసేజ్ లను పూర్తి చదవచ్చు. ఎదుటి వారికి మీరు మెసేజ్ చదివినట్లు మాత్రం తెలియదు.
వాట్సాప్ పాప్-అప్‌ల ద్వారా..
WhatsApp సెట్టింగ్ ని ఓపెన్ చేసి.. నోటిఫికేషన్ ను ఎంచుకోవాలి. పాప్-అప్ నోటిఫికేషన్ ఎంపికను ఆన్ చేయాలి. ఇప్పుడు మీరు పాప్-అప్‌ల ద్వారా వాట్సాప్ మెసేజ్ లను ఎదుటి వారికి తెలియకుండా చూసుకోవచ్చు.
WhatsApp విడ్జెట్ ద్వారా..
విడ్జెట్ ద్వారా వాట్సాప్ సందేశాలను చదవడానికి.. దాన్ని మీ హోమ్ స్క్రీన్‌పైకి తీసుకురావాలి. యాప్ ను తెరవకుండానే అన్ని సందేశాలను చదివే అవకాశం ఉంటుంది. మొత్తంగా పై టిప్స్ ఫాలో కావడం మూలంగా మీకు తెలిసిన వారు పంపిన మెసేజ్ లను బ్లూ టిక్ పడకుండా చూసే వీలుంది.
ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం ద్వారా..
అటు ‘ఫ్లైట్ మోడ్’ ఆన్ చేసి మెసేజెస్ చదివినా, ఎదుటివారికి తెలియదు. ఫ్లైట్ మోడ్ ఆన్ కాగానే మీ స్మార్ట్ ఫోన్‌లోని అన్ని సిగ్నల్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. దీని వల్ల బ్లూటిక్స్ అనేవి పడవు.
Read Also: మీ వాట్సాప్ డౌన్ అయ్యిందా? కంగారు పడొద్దు, ఈ 5 యాప్స్ వాడుకోండి