టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని కొత్త విషయాలు నేర్చుకునేందుకు వినియోగించుకునే వారు కొందరైతే, దాంతో టైంపాస్ చేసే వాళ్లూ ఉన్నారు. వాట్సాప్ లేకుంటే ఇప్పటి తరానికి పొద్దుపోదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా సందేశాలు పంపుకొనేందుకు ఎక్కువమంది ఈ యాప్‌నే వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ ఏ సరికొత్త అప్‌డేట్ తీసుకొచ్చినా తక్షణం తెలుసుకోవాల్సిందే. వాట్సాప్ ద్వారా ఫోటోలు తీసి స్టేటస్ అప్‌డేట్ చేసుకోవాలన్నా, ఎవరికైనా ఫోటోలు పంపాలన్నా మరింత సులభతరంగా ఉండేందుకు... కెమెరా ఆప్షన్‌ను మరింత హ్యాండీగా మార్చారు.
ఐకాన్‌పై క్లిక్ చేస్తే చాలు
ఇప్పటివరకూ వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్ చేయాలంటే ఏదైనా కాంటాక్ట్ ఓపెన్ చేయడం లేదా స్టేటస్ పేజ్‌లోకి వెళ్లి కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాల్సి వచ్చేది. తాజా అప్‌డేట్‌తో కెమెరాను సులువుగా యాక్సెస్ చేయొచ్చు. గతంలో ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.
వాట్సాప్ తన వినియోగదారుల కోసం మూడు కొత్త ఫీచర్లను త్వరలో తీసుకురానుంది. దీంతో వాట్సాప్ వినియోగదారులకు మరింత ప్రైవసీ లభించనుంది. వాట్సాప్ తన ట్విట్టర్ పేజీలో ఈ మూడు ఫీచర్లను షేర్ చేసింది. మెటా సీఈవో, ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ మూడు ఫీచర్లను షేర్ చేశారు.
గ్రూపు సభ్యులకు తెలియకుండానే
సాధారణంగా మనం వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయితే వెంటనే గ్రూపు ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెస్తే మీరు గ్రూపు నుంచి ఎగ్జిట్ అయిన విషయం ఎవరికీ తెలియదు. కేవలం గ్రూప్ అడ్మిన్స్‌కు మాత్రమే కనిపిస్తుంది.
ఆన్‌లైన్‌లో ఉన్నా కనపడకుండా
వాట్సాప్‌లో లాస్ట్ సీన్ ఆఫ్ చేసినప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంటే ఆ విషయం మన చాట్ ఓపెన్ చేసినవారికి తెలుస్తుంది. కానీ వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తే మనం ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరికీ తెలియకుండా ప్రైవసీ ఫీచర్స్ మార్చుకోవచ్చు. కొందరికి మాత్రమే కనిపించేలా కూడా సెట్ చేసుకోవచ్చు.
ఫొటోలు స్క్రీన్ షాట్ తీయడం కూడా కష్టం కానుంది
ప్రస్తుతం వాట్సాప్‌లో ఫొటోలు పంపితే అవి ఫోన్‌లో స్టోర్ అవుతాయి. వాట్సాప్ కొత్తగా ‘వ్యూ వన్స్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఫొటో ఒక్కసారి చూడటానికి మాత్రమే వీలు అవుతుంది. కానీ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తే వ్యూ వన్స్ ద్వారా పంపిన ఫొటోను స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా అవ్వదు.
ఈ మధ్య కాలంలో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫేక్ న్యూస్‌లు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే వాట్సాప్ కొత్త ఫీచర్‌తో వీటికి చెక్ పెట్టే అవకాశం ఉంది. గ్రూప్‌లో పెట్టే మెసేజ్‌లను అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అడ్మిన్ ఏదైనా మెసేజ్‌ను గ్రూప్‌లో నుంచి డిలీట్ చేస్తే ఆ మెసేజ్‌ను అడ్మిన్ డిలీట్ చేసినట్లు కనిపిస్తుంది.
వాట్సాప్ బీటా v2.22.17.12 వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించినట్లు WABetaInfo కథనం ద్వారా తెలిసింది. ఈ ఫీచర్‌ను కొంతమంది టెస్టర్లకు ఇప్పటికే పంపించినట్లు సమాచారం. త్వరలో స్టేబుల్ వెర్షన్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గ్రూపులో మెసేజ్‌లను డిలీట్ చేసే యాక్సెస్ కేవలం ఆ మెసేజ్ పంపిన వారికి మాత్రమే ఉంది. ఇప్పుడు గ్రూప్ అడ్మిన్లకు కూడా ఆ ఫీచర్‌ను అందిస్తున్నారు. గ్రూప్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడితే అడ్మిన్స్ వాటిని డిలీట్ చేయవచ్చన్న మాట.