Hyderabad Husband Suicide: భార్యాభర్తల మధ్య గొడవలు చివరికి ప్రాణాలు తీసుకొనేందుకు సైతం వెళ్తున్నాయని చాటే మరో ఘటన ఇది. మరీ చిన్నపాటి మనస్పర్థలకే అలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా భార్యకు వీడియో కాల్ చేసి కోపంతో ఓ భర్త ఆత్మహత్య (Husband Suicide In Video Call) చేసుకున్నాడు. ఆ కాల్ లో ఉండగానే అతను ప్రాణాలు తీసుకున్నాడు. ‘మీ బంధువుల వివాహాలకు నేను వచ్చాను కదా.. మరి మా బంధువుల ఇంట్లో బోనాల కార్యక్రమం ఉంటే నువ్వు ఎందుకు రావడం లేదు’ అంటూ భార్యపై అలిగి ఆ వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) లోని పహాడీ షరీఫ్ (Pahadi Shareef Suicide) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.


రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో (Maheshwaram) పహాడీషరీఫ్‌ (Pahadi Shareef Suicide) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలో (Tukkuguda) ఉండే సాయి కార్తిక్‌ గౌడ్‌ అనే 33 ఏళ్ల వ్యక్తి, భార్య తో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. అత్తగారిల్లు కందుకూరు మండలం బేగంపేటకు వెళ్లాడు. అయితే, అప్పటి నుంచి భార్య పుట్టింటిలోనే ఉంది. ఈయన మాత్రం తిరిగి వెనక్కి వచ్చేశాడు. గత శనివారం ఇంటికి రాగా, ఆ మరుసటి రోజు ఆదివారం రోజే మీర్‌పేటలో (Meerpet Bonalu) జరిగే బోనాల కార్యక్రమం ఉంది. ఆ పండుగకి తన పిన్ని గారి ఇంటికి ఇంటికి వెళదామని భార్యకు చెప్పాడు.


ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లేందుకు ఆమె ఇంటికి రావాలని పదే పదే ఫోన్లు చేశాడు. అయితే, ఆమె ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. దీంతో ఈ విషయాన్ని సాయి కార్తీక్ గౌడ్ సీరియస్ గా తీసుకున్నాడు. వెంటనే అతను రవళికి వీడియో కాల్‌ చేసి తన ఆవేదన వెళ్లగక్కాడు. మీ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు నేను హాజరవుతున్నా, మరి మా తరపున బంధువుల ఇళ్లకు నువ్వు ఎందుకు రావంటూ అసహనం వ్యక్తం చేస్తూ వీడియో కాల్ లోనే అడిగాడు. 


Also Read: Suicide Cases: బైక్ కొనివ్వలేదని ఒకరు, మంచి జాబ్ లేదని మరో యువకుడు ఆత్మహత్య


ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా వాదన జరగడంతో తాను ఆత్మహత్య (Hyderabad Husband Suicide) చేసుకుంటున్నానంటూ ఈ కాల్ లోనే ఇంట్లోని దూలానికి ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో కింద పడడంతో ఆ ఫుటేజీ రికార్డు కాలేదు. అనుమానం వచ్చిన రవళి వెంటనే భర్త వద్దకు బయలుదేరింది. ఆ లోపు పక్కింటి వాళ్లకు ఫోన్లు చేసి, భర్తను కాపాడాలని వేడుకుంది. అయినా, ఫలితం లేకపోయింది. ఇంటికి చేరుకునేప్పటికే భర్త మృతి (Pahadi Shareef Husband Suicide) చెందడంతో ఆమె కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.


Also Read: Naina Jaiswal : నైనా జైస్వాల్ కు ఇన్ స్టాలో వేధింపులు, యువకుడు అరెస్టు!