Naina Jaiswal : టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ను ఇన్ స్టా గ్రామ్ లో ఓ యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనపై నైనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను శ్రీకాంత్ అనే యువకుడు వేధించాడు. శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత కొంతకాలంగా శ్రీకాంత్ ఇన్‌స్టా గ్రామ్‌లో నైనా జైస్వాల్‌పై అసభ్యకరంగా పోస్టులు పెట్టి వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అసభ్యకర మెసేజ్ లు
అంతకు ముందు శ్రీకాంత్ ఇలానే వేధింపులు గురిచేశాడని అప్పట్లో నైనా జైస్వాల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో యువకుడికి సిద్దిపేట పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా శ్రీకాంత్ ప్రవర్తన మార్పురాలేదు. ఇటీవల నైనా జైస్వాల్ పై ఇన్‌స్టాగ్రామలో మరోసారి అసభ్యకర మెసేజ్ లో పెట్టాడు. దీంతో నైనా జైస్వాల్, ఆమె తండ్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సోషల్ మీడియాలో వేధింపులు
సోషల్ మీడియాలో వేధింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశాడు. శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడని నైనా జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా శ్రీకాంత్ వేధించాడని నైనా జైస్వాల్ తెలిపారు. అప్పట్లో శ్రీకాంత్ కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా తీరుమారని శ్రీకాంత్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి నైనా జైస్వాల్‌ను వేధిస్తున్నాడు. దీంతో నైనా తండ్రి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్ దేశంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరు. నైనా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పలు టైటిళ్లు గెలుచుకుంది.