In App Chat Support: ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌కు భారతదేశంలోనే 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రజలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, వెబ్‌లో వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.


వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ యాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది. కాగా విండోస్ యూజర్ల కోసం కంపెనీ యాప్‌లో కొత్త ఆప్షన్‌ను ఇచ్చింది. దీని సహాయంతో వాట్సాప్ అధికారులను సంప్రదించడం మరింత సులభం అయింది.


ఆ అప్‌డేట్ ఇదే
వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను అబ్జర్వ్ చేసే వెబ్‌సైట్ Wabetainfo ప్రకారం కంపెనీ Windows వినియోగదారులకు యాప్‌లో ఛాట్ సపోర్ట్‌ను అందించడం ప్రారంభించింది. అంటే ఇప్పటి వరకు మొబైల్‌లో హెల్ప్ సపోర్ట్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు విండోస్ యూజర్‌లు కూడా యాప్‌లో కూడా అదే విధంగా పొందుతారు.


వినియోగదారులు ఛాట్ లేదా మెయిల్‌లో వారి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవచ్చు. విండోస్ వినియోగదారులకు కూడా ఈ అప్‌డేట్‌ను పొందడం ప్రారంభించారు. ఈ ఫీచర్ ప్రయోజనం ఏంటంటే వినియోగదారులు వారి సమస్యలకు యాప్‌లోనే పరిష్కారం పొందుతారు. వారు యాప్‌ను వదిలి బయటకు రావాల్సిన అవసరం లేదు.


ఈ ఫీచర్లకు సంబంధించిన పనులు కూడా
వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లపై కూడా పనిచేస్తోంది. ఇందులో యూజర్‌నేమ్, వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేర్, కాల్ బ్యాక్ బటన్ మొదలైనవి ఉంటాయి. యూజర్‌నేమ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చిన తర్వాత యూజర్‌లు ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవాలి. దీని సహాయంతో వారు ఇతరులను కాంటాక్ట్స్‌కు జోడించగలరు. అదేవిధంగా స్క్రీన్ షేర్ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు వీడియో కాల్స్ సమయంలో మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి తమ స్క్రీన్‌ను షేర్ చేయగలరు. ఇది కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుస్తుంది.


వాట్సాప్ భారతదేశంలో 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి, కంపెనీ ఎప్పటికప్పుడు యాప్‌కి కొత్త అప్‌డేట్‌లను తెస్తుంది. మెటా త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అప్‌డేట్ అయిన కీబోర్డ్‌ను తీసుకురాబోతోంది.


వాట్సాప్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo ప్రకారం, కంపెనీ కీబోర్డ్‌కు సంబంధించి యూఐని రీడిజైన్ చేస్తోంది. అప్‌డేట్ కింద వినియోగదారులు జిఫ్, స్టిక్కర్, ఎమోజీ ఆప్షన్లను కీబోర్డ్‌లో దిగువన కాకుండా ఎగువన పొందుతారు.


అదేవిధంగా, విభిన్న మూడ్‌ల ఎమోజీని ఎంచుకోవడానికి, కంపెనీ ఎమోజి ప్యానెల్‌ను పైభాగానికి బదులుగా దిగువకు మార్చబోతోంది. దీంతో పాటు వినియోగదారులు డెస్క్‌టాప్‌లోని ప్లస్ సైన్ తరహాలో ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్‌ను పొందుతారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా వారు కాంటాక్ట్, ఇమేజ్, పోల్ విభిన్న ఆప్షన్లను ఎంచుకోగలుగుతారు.


మొత్తం మీద మెరుగైన చాటింగ్ ఎక్స్‌పీరియన్స్, అన్ని ఫంక్షన్‌లకు ఒక క్లిక్ యాక్సెస్ కోసం కంపెనీ ఈ అప్‌డేట్‌లను యాప్‌కి తీసుకువస్తోంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఇది రాబోయే కాలంలో అందరికీ అందుబాటులో ఉంటుంది.





Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?