వాట్సాప్ కాల్ లింక్స్ అనే కొత్త ఫీచర్‌ను రోల్‌అవుట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ కాల్స్‌కు లింక్స్‌ను క్రియేట్ చేయవచ్చు. ఈ లింక్స్ ద్వారా కొత్త కాల్ స్టార్ట్ చేయవచ్చు, లేదా అప్పటికే జరుగుతున్న కాల్‌లో జాయిన్ అవ్వవచ్చు. ఈ కాల్ లింక్స్ ఆప్షన్ కాల్స్ ట్యాబ్‌లో చూడవచ్చు. వినియోగదారులు దాని ద్వారా ఒక లింక్ క్రియేట్ చేసి ఆడియో, వీడియో కాల్ ప్రారంభించవచ్చు. దాన్ని ఇతర ప్లాట్‌ఫాంల్లో కూడా షేర్ చేయవచ్చు.
ఈ ఫీచర్ ఈ వారంలోనే రోల్అవుట్ కానుంది. అయితే దీన్ని ఉపయోగించాలంటే యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉండాలి. వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్స్‌లో 32 మంది చేరేలా ఉండే ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
వాట్సాప్ కాల్ లింక్స్ ఫీచర్ అంటే ఏంటి?
గూగుల్ మీట్, జూమ్ మీటింగ్‌లను మనం లింక్‌ల ద్వారా ఎలా షేర్ చేస్తామో, వాట్సాప్ వీడియో కాల్ లింక్స్‌ను కూడా అలా షేర్ చేసుకోవచ్చు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కాల్‌లో జాయిన్ అవ్వవచ్చు. కేవలం వాట్సాప్‌లోనే కాకుండా మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో కూడా దీన్ని షేర్ చేయవచ్చు.
అయితే ఈ ఫీచర్ మొదట ఆండ్రాయిడ్‌కు అందుబాటులోకి వస్తుందో, లేకపోతే ఐవోఎస్‌కు అందుబాటులోకి వస్తుందో తెలియరాలేదు. లింక్‌కు సంబంధించిన ఫీచర్ కాబట్టి రెండు ప్లాట్‌ఫాంలకు ఒకేసారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
లింక్ క్రియేట్ చేయాలంటే వినియోగదారులు కాల్ స్టార్ట్ చేశాక కాల్స్ ట్యాబ్‌లో ఉన్న కాల్ లింక్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఆడియో కాల్ లేదా వీడియో కాల్‌ను లింక్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?