WhatsApp Phone Number Privacy Feature: యాప్‌లో వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరచడానికి వాట్సాప్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కాగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా టెస్టర్ల కోసం కంపెనీ 'ఫోన్ నంబర్ ప్రైవసీ' ఫీచర్‌ను విడుదల చేసింది.


దీని సహాయంతో వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను కమ్యూనిటీ గ్రూపుల్లో దాచవచ్చు. మీ నంబర్ గ్రూప్ అడ్మిన్‌లకు, మీ నంబర్‌ను సేవ్ చేసిన వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Wabetainfo షేర్ చేసింది.


బీటా టెస్టర్లకు మాత్రమే
కొత్త ఫీచర్ కమ్యూనిటీ గ్రూప్‌లోని ప్రొఫైల్ విభాగంలో బీటా టెస్టర్‌లకు మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను ఇతరుల నుంచి హైడ్ చేయవచ్చు. మీరు కమ్యూనిటీలో మెసేజ్ చేసినా మీ నంబర్‌ను ఎవరూ చూడలేరు. చాలా మంది యూజర్లు కమ్యూనిటీ గ్రూపులో ఎమోజీతో రియాక్ట్ అయ్యే ఫీచర్‌ను పొందడం ప్రారంభించారు.


నంబర్ రిక్వెస్ట్ చేయాలి
త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ కేవలం కమ్యూనిటీ గ్రూపులోని మెంబర్లకు మాత్రమే. గ్రూప్ అడ్మిన్ నంబర్ ఎల్లప్పుడూ కనిపిస్తుంది. నంబర్‌ను హైడ్ చేసినప్పటికీ మీరు దాన్ని పొందాలనుకుంటే మొదట ఒక రిక్వెస్ట్‌ను పంపాలి. దానిని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే అవతలి వ్యక్తి నంబర్ మీకు వస్తుంది. ప్రస్తుతం ఫోన్ నంబర్ ప్రైవసీ ఫీచర్ కమ్యూనిటీ గ్రూపులకు మాత్రమే ఉంది. రాబోయే కాలంలో మామూలు గ్రూపుల కోసం కూడా దీన్ని ప్రారంభించవచ్చు.


అందరూ ఎదురుచూస్తున్న ఫీచర్
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాగానే ఉంటుంది. దీని సహాయంతో మీరు మీ మొబైల్ నంబర్‌ను హైడ్ చేయగలరు. యూజర్ నేమ్ సాయంతో మీరు కాంటాక్ట్స్‌ను యాడ్ చేసుకోగలరు. అంతే కాకుండా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి కంపెనీ అనేక కొత్త ఫీచర్లపై పని చేస్తోంది.








Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial