వాట్సాప్‌లో పొరపాటున ఏమైనా మెసేజ్‌లు పెడితే వాటిని తర్వాత డిలీట్ చేసే ఫీచర్ ఉంది. అయితే ఈ ఫీచర్ కేవలం గంట వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే గంటలోపు పెట్టిన మెసేజ్‌లు మాత్రమే మనం డిలీట్ చేయగలం అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని రెండు రోజులకు పెంచడంపై వాట్సాప్ పనిచేస్తుంది.
WABetaInfo కథనం ప్రకారం వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ చేయడానికి టైమ్ రిస్ట్రిక్షన్‌ను 2 రోజుల 12 గంటలకు పెంచనుందని వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ ప్రస్తుత బీటా వెర్షన్ 2.22.15.8తో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గంటా 8 నిమిషాల 16 సెకన్ల సమయంతో పోలిస్తే అది చాలా ఎక్కువ.
మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌కు ప్రధాన పోటీ అయిన టెలిగ్రాం మెసేజ్‌లను 48 గంటల తర్వాత కూడా డిలీట్ చేసే ఆప్షన్ అందిస్తుంది. అయితే బీటా వెర్షన్ ఇన్ఫర్మేషన్‌లో ఈ ఫీచర్ గురించిన సమాచారం లేదు. ఇది అందుబాటులోకి వచ్చిందో లేదో తెలియాలంటే మెసేజ్ చేసి రెండు గంటల డిలీట్ చేయడానికి ప్రయత్నించండి.
వాట్సాప్ త్వరలో కొత్త తరహా మెసేజ్ డిలీటింగ్ ఫీచర్లు కూడా అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు పెట్టిన మెసేజ్‌లను డిలీట్ చేసే ఆప్షన్‌ను అడ్మిన్లకు కల్పిస్తుంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులో రానుంది. వాట్సాప్ మే నెలలో మనదేశంలో 19 లక్షలకు పైగా ఖాతాలను డిలీట్ చేసినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!