ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ వెర్షన్‌లో యాప్ సెట్టింగ్స్ కోసం కొత్త ఇంటర్‌ఫేస్‌ను తీసుకువస్తోంది. ఇది వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. WABetaInfo నివేదిక ప్రకారం ప్రొఫైల్ ఫోటోను చూపించే కొత్త U ట్యాబ్‌తో సెట్టింగ్స్ ట్యాబ్‌ను రీప్లేస్ చేయడం బీటా వినియోగదారులు గమనించవచ్చు. మల్టీపుల్ అకౌంట్ ఫీచర్ స్టార్ట్ అయినప్పుడు యూజర్లు సులభంగా వేరే అకౌంట్‌కు స్విచ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది.


వినిపిస్తున్న వార్తల ప్రకారం వాట్సాప్ వినియోగదారులు ఈ కొత్త ఇంటర్‌ఫేస్ సహాయంతో ప్రైవసీ సెట్టింగ్స్, కాంటాక్ట్ లిస్ట్, ప్రొఫైల్‌లను సులభంగా యాక్సెస్ చేయగలరు. కొత్త ఇంటర్‌ఫేస్‌తో పాటు, యాప్‌లోని ముఖ్యమైన విభాగాలను బాగా హైలైట్ చేయడానికి మూడు కొత్త ఎంట్రీ పాయింట్‌లను కూడా వాట్సాప్ పరిచయం చేసింది. వినియోగదారులు వారి వ్యక్తిగత క్యూఆర్ కోడ్‌ను చూడటానికి, షేర్ చేయడాన్ని ప్రొఫైల్ ఫోటో దగ్గర నుంచే చేయవచ్చు.


ఐవోఎస్ కోసం వాట్సాప్ బీటా తాజా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది టెస్టర్‌లకు కొత్త సెట్టింగ్స్ ఇంటర్‌ఫేస్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే రాబోయే వారాల్లో మరింత మంది వినియోగదారులకు దీన్ని అందిస్తారని నివేదిక పేర్కొంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో క్యాప్షన్ మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేయడం ప్రారంభించినట్లు గత వారం తెలిపారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు మెసేజ్‌ని పంపిన 15 నిమిషాలలోపు వీడియోలు, జిఫ్‌లు, డాక్యుమెంట్స్ కోసం క్యాప్షన్‌లను ఎడిట్ చేయవచ్చు.


వినియోగదారులు మెసేజ్‌ను ఏ డివైస్ నుంచి పంపారో ఆ డివైస్ నుంచి మాత్రమే క్యాప్షన్‌లను ఎడిట్ చేయవచ్చు. మెసేజ్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు మీరు మొబైల్‌ నుంచి మెసేజ్ చేశారనుకోండి. దాన్ని ఆ మొబైల్‌లో మాత్రమే ఎడిట్ చేయవచ్చు. వేరే డెస్క్‌టాప్ వెర్షన్, డెస్క్‌టాప్ యాప్ నుంచి చేయలేరు. దీంతోపాటు వాట్సాప్ యూజర్లు ఇకపై హెచ్‌డీ క్వాలిటీలో ఫోటోలను పంపవచ్చని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. అంతర్జాతీయంగా హెచ్‌డీ ఫోటో ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తోందని, దీంతోపాటు హెచ్‌డీ వీడియోలు పంపే ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.


మరోవైపు శాంసంగ్ అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో కొత్త కెమెరా సెన్సార్లపై పని చేస్తుంది. 2023 ప్రారంభంలో శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ అల్ట్రా మోడల్‌లో ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే 10x ఆప్టికల్ జూమ్ కోసం మరో 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial